Breaking News

05/12/2019

ఇవీ దేవికారాణి ఆస్తుల చిట్టా

హైదరాబాద్ డిసెంబర్ 05 (way2newstv.in)
ఈఎస్ ఐ స్కామ్ లో దేవికారాణి ఆస్తుల చిట్టా ని ఏసీబీ గురువారం విడుదల చేసింది. దేవికారాణి వంద కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ భారీగా స్థిరాస్తులను గుర్తించారు. దేవికారాణి అక్రమాల్లో ఆమె భర్త గురుమార్తి కుడా హస్తముందని అన్నారు. నారాయణగూడలోని ఇండియన్ బ్యాంక్ లో రూ.34లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్లు గుర్తించారు. 
ఇవీ దేవికారాణి ఆస్తుల చిట్టా

వేర్వేరు 23 బ్యాంకుల్లో కోటీ 23 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్టు గుర్తించారు. దేవికారాణి ఇంట్లో 25.72లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సీజ్ చేసారు. దేవికారాణి ఇంట్లో 8.40లక్షల నగదు, 7లక్షల ఎలక్ట్రానిక్ వస్తువులు దొరికాయి. 20 లక్షల ఇన్నోవా కారు, 60 వేల మోటర్ బైక్ కుడా స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు చోట్ల రూ.15 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో 100 కోట్లపై మాటే. పీఎంజే జ్యువెల్లర్స్ కు రూ.7.3 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు.

No comments:

Post a Comment