Breaking News

05/12/2019

పేదింటి ఆడబిడ్డకు వరం కళ్యాణలక్ష్మి

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
అసిఫాబాద్ డిసెంబర్ 05 (way2newstv.in)
కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాగజ్ నగర్ మున్సిపాలిటీ కాగజ్ నగర్ మండలానికి సంబంధించిన 434 లబ్ధిదారులకు ₹4.23 లక్షల విలువ గల  కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప   పంపిణీ చేశారు...ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూపేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం వరం లాంటిది అని  ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు పేర్కొన్నారు..
పేదింటి ఆడబిడ్డకు  వరం కళ్యాణలక్ష్మి

 సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించడంతో పాటు వారిలో ఒక కుటుంబసభ్యుడిగా వ్యవహరిస్తున్నాడన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు.పేదల కన్నీరు తుడిచేందుకే సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని స్పష్టం చేశారు  ప్రజల కష్టాలు తెలిసిన సిఎం కేసిఆర్... వారి సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలతో పేదింటి వారు సంతోష పడుతున్నారన్నారు,ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కెసిఆర్ నిండునూరేళ్ళు చల్లగా ఉండాలని, దీవించాలని కోరారు..అనంతరం కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు...ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు  కృష్ణారావు గారు, ఎంపిపి శంకర్ గారు, తహసీల్దార్లు యుగేందర్, లింగమూర్తి, గార్లు తదితరులు పాల్గొన్నారు...

No comments:

Post a Comment