విజయవాడ డిసెంబర్ 26 (way2newstv.in)
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరించందన్ ను గురువారం ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కలిసారు. కడప జిల్లా రాయచోటిలో దాతలు ఇచ్చిన కాలేజి స్దలాన్ని ముస్లిం ప్రజలకు ఇస్తానని జగన్ వాగ్దానం చేయటంపై గవర్నర్ కి ఫిర్యాదు చేసారు. నాలుగు ఎకరాలు దాతలు ఇచ్చిన భూమిని ఇష్టానుసారం దారదత్తం చేయటం తగదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
గవర్నర్ కు కలిసిన కన్నా లక్ష్మినారాయణ
తరువాత కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. జగన్ రాష్ట్రాన్ని సొంత జారీరులా భావిస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారు. గత ప్రభుత్వం పోలీసులను వాడుకుంటే, ఈ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అమరావతికి మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో శుక్రవారం గంట సేపు మౌన దీక్ష చేస్తాననని అన్నారు.
No comments:
Post a Comment