మెదక్, డిసెంబర్ 20, (way2newstv.in)
పాఠశాల విద్యారంగం పరిస్థితి విచిత్రంగా ఉన్నది. సర్కారు బడుల్లో పిల్లలు తక్కువున్న చోటే ఒక్కో విద్యార్థిపై ఎక్కువ ఖర్చు అవుతున్నది. ఎక్కువ మంది విద్యార్థులున్న చోట తక్కువవుతుండడం గమనార్హం. 30 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.63,637 ఖర్చు చేస్తున్నది. 30 నుంచి 100 మందిలోపు ఉంటే ఒక్కొక్కరిపై రూ.39,814, ఇక 100 నుంచి 200 మందిలోపు ఉన్న పాఠశాలల్లోని ఒక్కో విద్యార్థిపై రూ.30,234 ఖర్చు చేస్తున్నారు. 200 మంది కంటే ఎక్కువున్న పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై రూ.22,715 ఖర్చు పెడుతున్నారు. సర్కారు బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రెండు జతల బట్టలు, పాఠ్యపుస్తకాల పంపిణీ చేస్తున్నారు. అర్హులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారు.
పాఠశాల విద్యలో మళ్లీ రేషనలైజేషన్
టీచర్ల జీతాలతో కలిపి ఒక్కో విద్యార్థిపై అయ్యే ఖర్చును కార్తీక్ మురళీధరన్ నేతృత్వంలోని జేపాల్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఎక్కువ పాఠశాలల్లో ఒకరు, ఇద్దరు, ముగ్గురు పిల్లలే ఉంటున్నారని అంచనా వేసింది. 2019-20 బడ్జెట్‌లో రూ.12,220 (6.71 శాతం) కోట్లు కేటాయించింది. ఇందులో పాఠశాల విద్యారంగానికి రూ.8,209.01 కోట్లు ప్రతిపాదించింది. సంఖ్య ఎక్కువున్న పాఠశాలలను అన్ని విధాలుగా బలోపేతం చేయడంపై అధికారులు దృష్టిసారిస్తున్నారు.ఒకే తరగతి గదిలో వివిధ తరగతుల పిల్లలు ఉండడం పెద్ద సవాల్‌గా మారింది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మందికి, ఉన్నత పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. తరగతికి ఒక టీచర్ అనే పద్ధతిని పాటించ కుండా ఆ పాఠశాలలో ఉండే విద్యార్థుల సంఖ్యకు అను గుణం గా ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. దీంతో తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో తీవ్ర ఇబ్బం దులు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు ఒక పాఠశాలలో 60 మంది విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యా యులు పనిచేస్తున్నారు. ఆ స్కూల్లో ఒక గదిలో 1,2,3 తరగతుల పిల్లలు, ఇంకో గదిలో 4,5 తరగతుల విద్యార్థులు చదవాల్సి వస్తున్నది. దీంతో సర్కారు బడుల్లో ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఈ విద్యార్థులే ఉన్నత పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రాథమిక విద్య లోప భూయిష్టంగా ఉండడంతో ఉన్నత పాఠశాలల్లో వారు రాణించలేక పోతున్నారు. రాష్ట్రంలో 24,550 ప్రభుత్వ పాఠశాలలు న్నాయి. ఇందులో 30 మందిలోపు విద్యార్థులు న్న పాఠశా లలు 9,505 ఉంటే, వాటిలో 17,808 మంది ఉపా ధ్యాయులు పనిచేస్తున్నారు. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తున్న స్కూళ్లు 3,750 ఉన్నాయి. 1,37,471 మంది విద్యావాలంటీర్లతో కలిపి ఉపాధ్యాయు లు పనిచేస్తున్నారు. వారి వేతనాలకు రూ.7,956.44 కోట్లు ఏటా వ్యయం అవుతున్నది. అంటే ఒక్కో ఉపాధ్యాయుని పై సగటున ఏటా రూ.5,78.772 ఖర్చు చేస్తున్న ది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యారంగాన్ని ఎలా బలోపేతం చేయాలన్న విషయమై అధికారులు కసరత్తు చేస్తున్నారు
No comments:
Post a Comment