Breaking News

20/12/2019

దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజించాలనుకుంటున్నారా?

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి
హైదరాబాద్ డిసెంబర్ 20 (way2newstv.in)
పౌరసత్వ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజించాలనుకుంటున్నారా అని రాజకీయ పార్టీలు, మేధావులను ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ పౌరులకు వ్యతిరేకంగా బిల్లులో చిన్న పదం కానీ వాఖ్యం కానీ లేదన్నారు. రాజకీయ పార్టీలు, మేధావులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 
దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజించాలనుకుంటున్నారా?

ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. సీఏఏ పై పశ్చిమబెంగాల్ సీఎం చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ సీఏఏపై యూఎన్ వంటి ఒక నిస్పాక్షికమైన సంస్థ కమిటీని ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ పేర్కొన్నారు. సీఏఏతో తృణమూల్ కాంగ్రెస్ స్థానం జారిపోతుంది. అందుకే ఆమె కోపంగా ఉన్నారు. కనీస అవగాహన లేకుండా ఏమి మాట్లాడుతున్నారో ఆమెకే తెలియకుండా ఉంది. ఒక సీఎం అయి ఉండి బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

No comments:

Post a Comment