తుగ్గలి డిసెంబర్ 27 (way2newstv.in)
రైల్వే సిగ్నల్స్ పునరుద్ధరణలో భాగంగా విజయవాడ మరియు హుబ్లీ ప్యాసింజర్లను 2020 జనవరి 2-4 తేదీలలో మూడు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు.తోరణగల్లు సమీపంలో సిగ్నల్ ల పునరుద్దరణలో భాగంగా ట్రైన్ నెంబర్ 56502 హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ ను జనవరి 1,2 మరియు 3 తేదీలలో రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలియజేశారు.
పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
అదేవిధంగా 56501 విజయవాడ-హుబ్లీ ప్యాసింజర్ ను జనవరి 2,3 మరియు 4 తేదీలలో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. వీటితో పాటుగా 57273 హుబ్లీ-తిరుపతి,57274 తిరుపతి-హుబ్లీ ప్యాసింజర్ లను 2,3 మరియు 4 వ తేదీల్లో రద్దు చేసినట్టు తెలియజేశారు.జనవరి 5 నుండి రద్దు చేసిన రైలు యదావిధిగా ప్రారంభమవుతాయని తెలియజేశారు.ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలియజేశారు.
No comments:
Post a Comment