Breaking News

17/12/2019

వారసుడి రూట్ మార్చేశారు...

ముంబై, డిసెంబర్ 17 (way2newstv.in)
పార్టీల అంతిమ లక్ష్యం అధికార సాధనే. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు ఒకింత ముందుంటాయి. ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించే ఈ పార్టీలు అధికార సాధనే లక్ష్యంగా పనిచేస్తుంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా… ఇది నిజం. కానీ శివసేన ఇందుకు పూర్తిగా మినహాయింపు. అది రాజకీయ పార్టీగా తన ప్రస్థానాన్ని అయిదు దశాబ్దాల క్రితమే ప్రారంభించినప్పటికీ అప్పట్లో దాని లక్ష్యం అధికార సాధన కానే కాదు. మరాఠాల ఆత్మగౌరవం దాని ప్రధాన నినాదం. విద్య, ఉద్యోగ, ఇతర ఉపాధి అవకాశాల్లో మరాఠీలకు ప్రాధాన్యం దాని లక్ష్యం. అందుకే ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాక్రే కానీ, ఆయన తదనంతరం వారసుడిగా పార్టీ బాధ్యతలను చేపట్టిన ఆయన కుమారుడు ఉద్ధవ్ థాక్రే గాని ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏనాడు ఆసక్తి చూపలేదు.ఇప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ ఆరు నెలల్లో ఏదో ఒక చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. 
వారసుడి  రూట్ మార్చేశారు...

ఇలా చట్ట సభ సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రి అయిన నేతల్లో ఉద్ధవ్ థాక్రే ఎనిమిదో నాయకుడు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అబ్దుల్ రాహమాన్ అంతూలే, వసంత్ దాదా పాటిల్, శివాజీరావు నీలంకర్ పాటిల్, శంకరరావు చవాన్, సుశీల్ కుమార్ షిండే, పృధ్వీరాజ్ చౌహాన్ లు చట్ట సభల్లో సభ్యులు కాకుండానే ముఖ్యమంత్రులు అయ్యారు. ప్రస్తుతం ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే ముంబయి నగరంలోని వర్లీ నియోజకవర్గం నుంచి శానసనభకు ఎన్నికయ్యారు.శివసేన ప్రస్థానం ఆసక్తిదాయకం. స్వతహాగా కార్టూనిస్టు అయిన పార్టీ అధినేత బాల్ థాక్రే సామాన్యుడు. తన చిత్రాలతో సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టే వారు. చిత్రం, కథనంతో పాటు అధికార పత్రిక సామ్నాను కూడా థాక్రే ప్రారంభించారు. అందులో అనేక రచనలు చేశారు. స్వరాష్ట్రంలో మారాఠాలు ఎదుర్కొంటున్న వివక్షను అంతమొందించడానికి శివసేన పార్టీ 53 ఏళ్ల క్రితం ప్రారంభించారు. అయినప్పటికీ ఎన్నికల రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించలేదు. సుదీర్ఘ విరామం అనంతరం మే ఎన్నికల బరిలోకి దిగింది. తొలుత మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం మహారాష్ట్ర, గుజరాత్ గా విడిపోయింది. హైదరాబాద్ సంస్థానంలో మరాఠీ భాషను మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో విలీనం చేశారు. కానీ ముంబయి సహా మహారాష్ట్రలో మరాఠీలకు తగిన గుర్తింపు కొరవడింది. వారికన్నా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన వారికి ఉద్యోగ, ఉపాధిద అవకాశాలు లభించాయి. వీరు ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. వైట్ కాలర్ ఉద్యోగాలు సాధిస్తున్నారు. అదే సమయంలో మరాఠీలు కూలీలుగా, పోర్టర్లుగా, డ్రైవర్లుగా మిగిలిపోతున్నారు. ఇది థాక్రేను కలచి వేసింది. దీంతో మరాఠీల ఆధిపత్యం గుర్తింపు, గౌరవం కోసం ఒక సంస్థ ఉండాలని తలపోశారు. ఆ ఆలోచన నుంచి పురుడుపోసుకున్నదే శివసేన. పూణే కేంద్రంగా సంస్థ ఆవిర్భవించినప్పటికీ ముంబయి కేంద్రంగా రాజకీయాలు నడిపింది. ముంబయితో పాటు కొంకణ్ ప్రాంతాాల్లోనూ విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పాగా వేసింది.దీంతో మరాఠీలు శివసేనను సొంత పార్టీగా భావించడం ప్రారంభించారు. అయినప్పటికీ శివసేన అధినేత బాల్ థాక్రే అధికార రాజకీయాల వైపు దృష్టి సారించలేదు. కానీ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా థాక్రేను కాదనలేని పరిస్థితి. ముంబయి సయితం ఆయనను గౌరవించేవారు. అణిగిమణిగి ఉండేవారు. మహారాష్ట్రను మరాఠాలే పాలించాలన్నది థాక్రే లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా హిందువులను ఆకట్టుకుంది. ముంబయిలో అత్యంత ప్రధానమైన గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఏటా శివసేన నిర్వహించేది. మరాఠాల ఆద్యుడు ఛత్రపతి శివాజీ స్పూర్తిని రగిలించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో కొన్ని వివాదాలనూ ఎదుర్కొంది. రైల్వే రిక్రూట్ మెంట్ పరీక్షలు రాసేందుకు ముంబయి వచ్చిన బీహారీలపై దాడులు చేసింది. దక్షిణాదికి చెందిన హోటళ్లను ధ్వసం చేసింది.ముంబయి వలస వచ్చిన ఇతర ప్రాంతాల వారిని వెనక్కు పంపింది. ఈ క్రమంలోనే ఎన్నికల రాజకీయంపై దృష్టి పెట్టింది. ఒకే భావాజలం గల బీజేపీకి చేరువైంది. 1995లో తొలిసారి అధికారాన్ని చేపట్టింది. పార్టీకి చెందిన మనోహర్ తోపే నారాయణ రాణే సీఎం అయ్యారు. ఈ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి. 1999 వరకూ ఈ ప్రభుత్వం కొనసాగింది. అప్పటి నుంచి బీజేపీతో స్నేహం కొనసాగింది. వాజ్ పేయి, అద్వానీ హయాంలో రెండు పార్టీల స్నేహం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిందిద. 2014లో బీజేపీలో మోడీ హవా ప్రారంభమయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. 2019 నాటికి విడిపోయే పరిస్థితి వచ్చింది. చివరకు బద్ధ శత్రువైన కాంగ్రెస్ తో కలసి నడవాల్సి వచ్చింది. ఇందుకోసం హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. లౌకిక వాదాన్ని భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. చివరకు ఫక్తు రాజకీయ పార్టీగా శివసేన రూపాంతరం చెందింది.

No comments:

Post a Comment