న్యూఢిల్లీ, డిసెంబర్ 31 (way2newstv.in)
భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ పదవిలో ఉన్న బిపిన్ రావత్ మూడేళ్ల పదవీకాలం ఈనెల 31తో ముగుస్తుంది. దీంతో బిపిన్ రావత్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరానే భారత ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. జనరల్ బిపిన్ రావత్ 1978 డిసెంబర్‌లో ఆర్మీలో జాయిన్ అయ్యారు. 2017 జనవరి 1 నుంచి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆయన నియామకం ఈనెల 31 నుంచి అమల్లోకి వస్తుంది.చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేసింది. కొత్తగా మార్పులు చేసిన దాని ప్రకారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ 65 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగవచ్చు.
ఆర్మీ స్టాఫ్ గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తారు. ట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్, రిపేర్, మెయింటెనెన్స్ అనే పలు రకాల వాటిలో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడమే ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ విధి.సైన్యంలోని మూడు విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉన్నారు. అయితే త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ముగ్గురిపై ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని 1982 జూన్ 2న అప్పటి జనరల్ కేవీ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత సైనిక వ్యూహాలపై సమీక్షించేందుకు నియమించిన మంత్రుల కమిటీ.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 2001లో ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరింది. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాలుగా సీడీఎస్ పదవి ప్రతిపాదనలకే పరిమితమైంది. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అమలు చేసింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ దేశానికి త్వరలోనే సీడీఎస్‌ను నియమిస్తామని ప్రకటించారు. ఈ నెల 24న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సీడీఎస్ పదవిని ఏర్పాటు చేసింది. సీడీఎస్ అధికారాలు, బాధ్యతలు తదితర అంశాలతో ప్రకటన విడుదల చేసింది. త్రివిధ దళాల్లో నాలుగు నక్షత్రాల హోదా కలిగిన అధికారిని సీడీఎస్‌గా నియమిస్తామని తెలిపింది. ఆ తర్వాత సీడీఎస్ పదవీ విరమణ వయసును 65 ఏండ్లుగా నిర్ధారించింది. ప్రస్తుతం త్రివిధ దళాధిపతుల పదవీ విరమణ వయసు 62గా ఉన్న నేపథ్యంలో.. సీడీఎస్ మూడేండ్లపాటు కొనసాగనున్నారు. సీడీఎస్‌కు మిగతా త్రివిధ దళాల అధిపతులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
No comments:
Post a Comment