Breaking News

04/12/2019

అస్త్రాలు, శస్త్రాల పనిలో ప్రతిపక్షాలు

విజయవాడ, డిసెంబర్ 4  (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానుండటంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలయినప్పటికీ ఈసారి హాట్ హాట్ గా సమావేశాలు సాగనున్నాయి. రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకోవాలని నిర్ణయించుకోవడంతో మరోసారి అసెంబ్లీ సమావేశాలు రణరంగంగా మారనున్నాయి.ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణలను తీవ్రతరం చేసింది. ఆందోళనలను నిర్వహించింది. 
అస్త్రాలు, శస్త్రాల పనిలో ప్రతిపక్షాలు

ప్రధానంగా ఇసుక, ఇంగ్లీష్ మీడియం, అన్నా క్యాంటీన్లు, రాజధాని అమరావతి, విద్యుత్తు కోతలు, టీడీపీ కార్యకర్తలపై అక్రమకేసులు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోవడం, ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి అంశాలపై వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఈ అంశాలపై చర్చకు తెలుగుదేశం పార్టీ పట్టు పట్టనుంది.దాదాపు పది రోజుల పాటు జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ లేవనెత్తే ప్రతి అంశంపై సమర్థవంతంగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం జగన్ పక్కా వ్యూహం రచించారు. అంశాల వారీగా మంత్రులు, సభ్యులను సెలెక్ట్ చేసిన జగన్ ఒక్కొక్కరికీ ఒక్కో అంశాన్ని సభలో డీల్ చేసేలా జగన్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అంశాల వారీగా ఎంపిక చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రతి రోజూ సాయంత్రం వేళ జగన్ సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు.ప్రతిపక్ష పార్టీ లేవనెత్తే అంశాలకు మాత్రమే కాకుండా ఆరు నెలల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై కూడా చర్చ జరిపేందుకు జగన్ రెడీ అవుతున్నారు. నవరత్నాల అమలుతో పాటు ఎన్నికల మ్యానిఫేస్టోలో పొందు పర్చిన అంశాలను ఆరు నెలల్లో ఎలా అమలు చేశామో జగన్ స్వయంగా సమావేశాల్లో చెప్పనున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు సయితం జగన్ ధీటుగా ఆన్సర్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇటీవల ఇంగ్లీష్, ఇసుక అంశాలపై జగన్ స్వయంగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి వాటిపై క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక రాజధాని అమరావతి అంశంపై కూడా జగన్ ఈ సమావేశాల్లోనే స్పష్టత ఇవ్వనున్నారు.

No comments:

Post a Comment