Breaking News

02/12/2019

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 140 మల్టీ నేషనల్ కంపెనీలు

సైబారాబాద్, డిసెంబర్ 2, (way2newstv.in)
ఒకప్పుడు సిటీకి దూరంగా ఉండే ప్రాంతం. కొండలు, గుట్టలు పొలాలతో నిండి ఉన్న ప్రాంతం. కానీ కాలం మారింది. ఇప్పుడు ఇన్వెస్ట్ మెంట్లకు స్వర్గధామంగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ కంపెనీల రాక మొదలవడంతో ఉన్న ఫళంగా అద్దాల మేడలు, నింగినంటే భవంతులతో అందర్నీ అట్రాక్ట్ చేస్తూ ఎంఎన్సీలతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కళకళలాడుతోంది. ఐటీ, బ్యాంకింగ్, ఫిన్ టెక్ సంస్థల ఏర్పాటుతోపాటు హైదరాబాద్ లో ఏ టెక్నాలజీ సర్వీస్ కంపెనీ ఏర్పాటు చేయాలన్నా ఇటువైపే చూస్తున్నారు.ఐటీ హబ్గా ఎదుగుతున్న వెస్ట్రన్ సిటీలో ప్రైమ్ ఏరి యా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. 2011లో స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద 312 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటైంది. మొదట ఐసీఐసీఐ తమ అతిపెద్ద బిజినెస్ సెంటర్ను ఇక్కడ ప్రారంభించింది. 
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 140 మల్టీ నేషనల్ కంపెనీలు

ఆ తర్వాత అమెరికా అసెట్మేనేజ్మెంట్ కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 15 ఎకరాల్లో క్యాంపస్ ఓపెన్ చేసింది. ఇక ఆపైన వేవ్ రాక్ ఐటీ సెంటర్, మైక్రోసాఫ్ట్, విప్రోలాంటి కంపెనీలతో పాటు ఒక్కొక్కటిగా వచ్చేశాయి.  తాజాగా అమెజాన్ సంస్థ  ప్రపంచంలోనే తమ అతిపెద్ద క్యాంపస్ ని 12 ఎకరాల్లో ఏర్పాటు చేసింది.తర్వాత వన్ ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్  అందుబాటులోకి రాగా…  మైక్రోసాఫ్ట్, విప్రో, హానీవెల్, కాగ్నిజెంట్, హిటాచీ వంటారా, వర్చుషా, యాక్సెంచర్, టీసీఎస్, సైయంట్, క్యాప్ జెమ్ని, వేవ్ రాక్, డెల్, ఇన్ఫోసిస్ లాంటి టాప్ ఐటీ సంస్థలు కూడా ఇక్కడి నుంచే కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటితో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో చిన్నా పెద్దా కలిపి 130కి పైనే ఐటీ కంపెనీలున్నాయి.  గూగుల్ క్యాంపస్ నిర్మాణం జరుగుతోంది. ఈ సంవత్సరం చివరికల్లా గూగుల్ కార్యకలాపాలు కూడా ఇక్కడ ప్రారంభం కానున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) హెడ్డాఫీస్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టీఎస్ఐఐసీ సైబర్ జోన్ ఆఫీస్ ఇక్కడే ఉన్నాయి.ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి ట్రాన్స్ పోర్ట్ కనెక్టివిటీ కూడా బాగుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకునే ఉండటం దీనికి ప్లస్ పాయింట్. ఇక్కడి నుంచి ఎయిర్ పోర్ట్ కి వెళ్లాలన్నా ట్రాఫిక్ ఇబ్బందిలేకుండా రింగ్ రోడ్ పై వెళ్లిపోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసేవారి సంఖ్య పెరగడంతో రాయదుర్గం నుంచి ఖాజాగూడ మీదుగా సిక్స్ లేన్ రోడ్ కూడా వేశారు. ఇక త్వరలో మెట్రో రైల్ కూడా రానుంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వేసే మెట్రో రైల్ లైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనుంచే వెళ్లనుంది. రోజురోజుకూ బిజీగా మారుతుండటంతో టీఎస్ఐఐసీ లింకు రోడ్ల నిర్మాణం పై దృష్టిపెట్టింది. సిటీలోని మెయిన్ ప్రాంతాల నుంచి వేవ్ రాక్ కి ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. ఇవే కాకుండా గచ్చిబౌలి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి ఫ్రీ షటిల్ బస్సులు కూడా నడుస్తున్నాయి.కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కువగా ఉండటంతోపాటు ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కూడా పెరిగిపోయాయి. గతంలో మంత్రి బిల్డర్స్, ఆ తర్వాత కపిల్ రెసిడెన్షియల్ టవర్స్ కూడా ప్రారంభమయ్యాయి. గౌలిదొడ్డి, నానక్ రామ్ గూడ, ఖాజాగూడ, కోకాపేట, నార్సింగి, కొల్లూర్, వెలుమల, కిస్మ త్ పూర్, గండిపేట్ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వస్తున్నాయి.

No comments:

Post a Comment