Breaking News

18/12/2019

చలి పంజా

నిజామాబాద్, డిసెంబర్ 18, (way2newstv.in)
తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాలో చలి తీవ్రత కొంతమేరకు పెరిగింది. గాలిలో తేమ 83శాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదు అయింది. రెండు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి ఉదయం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం వేళల్లో రోడ్లన్నీ మంచు కప్పుకుంటుడంతో చలి తీవ్రత మరింత పెరిగింది.ఇరువైపుల మంచుతో రోడ్లు కనిపించక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
చలి పంజా

ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు చలి నుంచి రక్షించుకునేందుకు ఉన్ని దుస్తులు ధరించడమే కాకుండా, పలు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు చలి తీవ్రతను తట్టుకోలేక ఉన్ని వస్త్రాలు ధరిస్తున్నారు. నగరవాసులు సాయంత్రం చీకటి పడగానే ఇళ్లకు చేరుకుంటున్నారు. పెథాయ్ తుపాన్‌తో తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని, చలి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గరంగరం ఛాయ్, వేడి వేడి తినుబండారాలకు గిరాకీ పెరిగింది.చలి పులి పంజా విసురుతోంది. ఐదు రోజులుగా జిల్లాలో మారుతున్న వాతావరణంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండగా, చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. మంచు వాతావరణం ఏర్పడి రోజంతా చలి గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చలి గాలుల తీవ్రత పెరిగి జిల్లా వాసులను ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఒక్క రోజు వ్యత్యాసంలోనే ఏకంగా ఒకటిన్నర డిగ్రీలు పడిపోయింది.ముఖ్యంగా పెరుగుతున్న చలి తీవ్రతకు చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యం భారిన పడుతున్నారు. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరాలకు గురికావడంతో ఆస్పత్రులకు తాకిడి పెరిగింది. స్వెట్టర్‌లు వినియోగించినా అవి చలి నుంచి స్వల్వంగానే రక్షిస్తున్నాయి. రాత్రుల్లో నిద్రపోయే సమయంలో దుప్పట్లు ఒకటికి రెండు వినియోగించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఫ్యాన్‌లకు ఏ మాత్రం పని చెప్పడం లేదు. ఇటు పనులపై, ఉద్యోగ రీత్యా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ముఖాలకు మాస్క్‌లు, చేతులకు గ్లౌజ్‌లు ధరించి అన్ని జాగ్రత చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు.

No comments:

Post a Comment