తిరుమల డిసెంబర్ 12 (way2newstv.in)
తిరుమలలోని వివిధ అతిథి గృహాల నిర్వహణ, భక్తులకు అందిస్తున్నసౌకర్యాలను టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి గురువారంనాడు వసతి, ఇంజనీరింగ్, ఎఫ్.ఎమ్.ఎస్. అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు రూ. 100 కోట్లతో తిరుమలలోని అతిథి గృహాల అధునీకరణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
తిరుమలలోని అతిథి గృహాలలో సౌకర్యాలను పరిశీలించిన అదనపు ఈవో
ఇందులో భాగంగా గదులలో ఫర్నిచర్ మార్పు, తలుపులు, ఫ్యాన్లు, పైకప్పు మరమత్తులు, గోడలకు పెయింటింగ్, సివిల్, ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయన్నారు. మరో 4 నెలలో పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకువస్తామన్నారు. అంతకుముందు సన్నిధానం, శంఖుమిట్ట, ఎస్.ఎమ్.సి., అదిశేషు అతిథి గృహాలను అధికారులతో కలిసి పరిశీలించారు. వసతి గృహాలలోని స్నానపు గదులలో వేడి నీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
No comments:
Post a Comment