Breaking News

31/12/2019

రాబోయే రోజుల్లో కనుమరుగైపోనున్న ప్రభుత్వ ఉద్యోగాలు?

హైదరాబాద్ డిసెంబర్ 31  (way2newstv.in)
ఇ-కామర్స్ బాగా పెరిగిపోతుండటంతో రాబోయే రోజుల్లో  కంప్యూటర్ ప్రోగ్రామర్లు, ఫైనాన్స్ డైరెక్టర్లు, కారు డ్రైవర్లు మాత్రమే అవసరం అవుతారు. వీరితో బాటు సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కన్సల్టెంట్స్, టెక్నాలజీ పబ్లిక్ రిలేషన్స్, బిహేవియరల్ సైంటిస్ట్స్, డేటా ఎనలిస్ట్స్, ఆన్‌లైన్ డేటా నిర్వాహకులు మాత్రమే సమాజానికి అవసరం అవుతారు. దీనితో రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగస్థులు, బ్యాంక్ క్లర్కులు, రిటైల్ కార్మికులు కనుమరుగైపోతారు తెలుసా? ప్రస్తుత ట్రెండ్స్ అలానే కనిపిస్తున్నాయి 
రాబోయే రోజుల్లో కనుమరుగైపోనున్న ప్రభుత్వ ఉద్యోగాలు?

అంటున్నారు బ్రిటన్ జాబ్ సెర్చి నిపుణులు. ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తవి రాకపోవడం, ఉన్నవారికి స్వచ్ఛంద పదవి విరమణ అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగులపై ఖర్చు తగ్గించుకోవాలని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం లాంటి చర్యలు ఈ దిశగా జాబ్ సెర్చిని మారుస్తాయని నిపుణులు అంటున్నారు.డ్రైవర్‌లేని కార్ల నుండి 3 డి ప్రింటింగ్ వరకు సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త యుగం లో వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది కానీ నిరుద్యోగం మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని యుకెకు చెందిన రాయల్ సొసైటీ ఫర్ ఆర్ట్స్, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ కామర్స్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక అంతా బ్రిటన్ కు సంబంధించిందే అందుకని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. బ్రెగ్జిట్ నేపథ్యంలో ఈ సర్వే చేశారు.

No comments:

Post a Comment