వరంగల్, డిసెంబర్ 2, (way2newstv.in)
తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకులుగా ఎదిగిన దంపతులు కొండా సురేఖ, మురళీలు. ఉమ్మడి రా ష్ట్రంలో కాంగ్రెస్‌లో ప్రారంభమైన వీరి రాజకీయాలు.. వైఎస్ హయాంలో పీక్‌కు చేరుకున్నాయి. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఈ దంపతులు ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. సురేఖ ఏకంగా మంత్రి పదవిని సైతం చేపట్టారు. మురళీ కూడా రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు. ఇక, వైఎస్ మరణంతో వీరి రాజకీయాలు అనూహ్యంగా మలుపులు తిరిగాయి. వైఎస్ మరణాంతరం ఈ ఫ్యామిలీ జగన్‌కు జై కొట్టింది. వైసీపీ తీర్థం పుచ్చుకుంది. ఆ తర్వాత 2012 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు.నిజానికి పార్టీలతో సంబంధం లేకుండా.. వ్యక్తిగత ఇమేజ్‌తోనే వారు ఎన్నికల్లో విజయాలు సాధించే స్థాయికి చేరుకున్నారు.
కమలం గూటికి కొండా దంపతులు
కేసీఆర్ దగ్గర కూడా అప్పట్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ, ప్రస్తుతం వీరి పరిస్థితి ఏంటి ? ఎటు వెళ్లాలి ? ఏం చేయాలి ? అన్నది వాళ్లకే తెలియని పరిస్థితి. నమ్మిన టీఆర్ ఎస్ నుంచి బయటకు రావడంతో ఇప్పుడు వీరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికలకు ముందు కొండా దంపతులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు నియోజవ కర్గం నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక కొండా మురళీ ఎమ్మెల్సీ అయ్యారు. కానీ.. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందు ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. అభ్యర్థుల తొలి జాబితాలో కొండా సురేఖ పేరును కేసీఆర్ ప్రకటించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కొండా దంపతులు కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో మండిపడి పార్టీని వీడారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల ఎమ్మెల్యేగా కొండా సురేఖ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొండా మురళి ఎమ్మెల్సీ పదవి కూడా పోయింది. ఇక అప్పటి నుంచి కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బయటకు కూడా రావడం లేదు.ఈ క్రమంలో వారు బీజేపీలోకి వెళ్తారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. కానీ, ఈ ప్రచారంపై వారు స్పందించడం లేదు.రాజకీయంగా వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో మాత్రం కొండా దంపతుల అనుచరులు చురుగ్గానే పాల్గొన్నారు. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారనే టాక్ మొదలైంది. కానీ, ప్రస్తుతం టీఆర్ఎస్‌ను ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో కాంగ్రెస్ పోటీ పడలేక పోతోంది. అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీలో ఉన్నా ప్రయోజనం లేదని కొండా దంపతులు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే వారు బీజేపీలోకి చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. రామ్‌మాధ్‌వతో కొండా దంపతులు గతంలోనే ఓ సారి భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ తెలంగాణలోనూ బలమైన పునాదులు వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఈ పార్టీని ఆశ్రయించడమే మేలని కొండా దంపతులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ క్రమంలో ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. నిలకడ లేని తనం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. టీఆర్ ఎస్‌లోనే ఉండి ఉంటే.. కొండా దంపతులకు కూడా మంచి గుర్తింపు, పదవులు ఖచ్చితంగా దక్కి ఉండేవని అంటున్నారు.
No comments:
Post a Comment