Breaking News

30/11/2019

నోరు ఎత్తని టాప్ హీరోలు

హైద్రాబాద్, నవంబర్ 30, (way2newstv.in)
హైదరాబాద్‌ షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్‌ను నలుగు మృగాళ్లు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితుల కుటుంబానికి మద్ధతు యువత రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తోంది. ఇప్పటికే పలువరు ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పంధించారు. వారిలో పలువురు సినీ తారలు కూడా ఉన్నారు.టాలీవుడ్‌లో టాప్‌ హీరోలుగా చెలామణీ అవుతున్నా వారు మాత్రం ఈ విషయంపై ఇంత వరకు పెదవి విప్పకపోవటం అభిమానులకు ఆగ్రహం కలిగిస్తుంది. బాధిత కుటుంబానికి అంతా అండగా నిలబడాల్సిన సమయంలో కూడా మన సినీ ప్రముఖులు ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు కారణమవుతోంది. 
 నోరు ఎత్తని టాప్ హీరోలు

తమ తోటి ఫిలిం స్టార్స్‌ బర్త్‌డేలకు, తమ సినిమాల ప్రచారానికి ట్వీట్లు చేసే సినీ ప్రముఖులు దేశవ్యాప్తంగా నిరాసనలు వెల్లువెత్తుతున్న సమయంలో కనీసం స్పందించకపోవటం ఏంటి అంటున్నారు ఫ్యాన్స్‌.వెటర్నరీ డాక్టర్‌ హత్య తరువాత ఎన్టీఆర్‌ హీరోగా నటించిన రాఖీ, టెంపర్‌ సినిమాల్లోని సీన్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి నేపథ్యంలో రెండు సినిమాలు చేసి అద్భుత విజయాలు అందుకున్న ఎన్టీఆర్‌, నిజంగా అలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రం స్పందించలేదు. సినిమాలలో పేజీల కొద్ది డైలాగ్‌లతో కాసుల పంట పండించిన జూనియర్‌, రియల్‌ లైఫ్‌లో మాత్రం అసలు స్పందించలేదు.తనూ ఓ ఆడపిల్ల తండ్రి అయిన సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కూడా ఈ విషయంపై స్పందించకపోవటం అందరికీ ఆశ్యర్యన్ని కలిగిస్తుంది. వరుసగా సందేశాత్మక చిత్రాలు చేస్తున్న మహేష్‌, సమాజంలో ఓ దారుణ సంఘటన జరిగినప్పుడు ఒక్క ట్వీట్ కూడా చేయకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతర హీరోల సినిమాలు విడుదలైనప్పుడు వారిని అభినందిస్తూ ట్వీట్లు చేసే సూపర్‌ స్టార్‌, రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరోలా స్పందించలేదు. మహేష్ భార్య నమ్రత కూడా ఈ విషయంపై నోరు మెదపలేదు.టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి కూడా ఈ విషయంలో మౌనంగానే ఉన్నాడు. రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకునే దర్శకధీరుడు, ఇంత పెద్ద సంఘటన విషయంలో మాత్రం ఒక్క ట్వీట్ కూడా చేయకపోవటం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

No comments:

Post a Comment