Breaking News

20/12/2019

మూడు కాకపోతే 30 కడతాం : పెద్దిరెడ్డి

తిరుపతి, డిసెంబర్ 20 (way2newstv.in)
ఏపీ రాజధానిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి తీసుకున్న 33వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తున్నామని.. రాజధాని భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికలకు ముందే జగన్ ప్రకటించారని గుర్తు చేశారు. అమరావతిలో నిర్మాణాలు తాత్కాలికమని చంద్రబాబు చెప్పారని.. తాము కూడా అమరావతిని తాత్కాలిక రాజధానిగానే భావించామన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజధానిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.మూడు రాజధానులు కాకపోతే ముప్పై రాజధానులు పెట్టుకుంటామన్నారు మంత్రి. రాజధానులతో కేంద్రానికి సంబంధం ఉండదని.. వాళ్ల నిధులు అవసరం లేదన్నారు. 
మూడు కాకపోతే 30 కడతాం : పెద్దిరెడ్డి

రాజధాని కోసం కేంద్రం అనుమతి అవసరం లేదని.. ఇది రాష్ట్ర పరిధిలోని విషయం అన్నారు. లెజిస్లేటివ్ కేపిటల్‌కు 300 ఎకరాలు సరిపోతుందని.. వేల ఎకరాలు అవసరం లేదంటన్నారు. హైదరాబాద్‌లో సెక్రటేరియట్, అసెంబ్లీ ఎన్ని ఎకరాల్లో ఉందని ప్రశ్నించారు. రాజధానికి వేల ఎకరాల భూమి అవసరం లేదంటున్నారు.ఇక రాజధానిని తరలించొద్దని అమరావతిలో ధర్నాలు చేసే వారంతా టీడీపీ కార్యకర్తలేనని ఆరోపించారు పెద్దిరెడ్డి. భూములు లాక్కొన్నవారే ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ కొనసాగుతోందన్నారు రామచంద్రారెడ్డి. చంద్రబాబు ఏ ఉద్దేశంతో రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారో చెప్పాలని.. తుళ్లూరు టీడీపీ నేతలు తక్కువ ధరకు భూములు కాజేశారని ఆరోపించారు. విశాఖలో వైసీపీ నేతల భూములు కొన్నారన్నది అవాస్తవమని.. ఇప్పటికే అక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు

No comments:

Post a Comment