Breaking News

07/11/2019

నేను ఉన్నాను... నేను చూస్తున్నాను : జగన్

గుంటూరు, నవంబర్ 7, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లే.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేశారు. . అగ్రిగోల్డ్‌ బాధితులకు గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో చెక్కులు పంపిణీ చేశారు. రూ.10 వేల లోపు డిపాజిట్లు చేసిన 3 లక్షల 70 వేల మందికి.. రూ.264 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. అలాగే 20 వేలలోపు డిపాజిట్‌ దారులకు న్యాయం చేస్తున్నామని.. రాబోయే రోజుల్లో మిగిలిన వారికి న్యాయం చేస్తామని తెలిపారు.హామీని నిలబెట్టుకొని అగ్రిగోల్డ్ బాధితుల ముందు నిలబడ్డానని.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తున్నందకు ఆనందంగా ఉందన్నారు సీఎం. 
నేను ఉన్నాను... నేను చూస్తున్నాను : జగన్

అగ్రిగోల్డ్‌ బాధితులు బాధలు చూశానని.. 3,648 కి.మీ సాగిన పాదయాత్రలో ప్రతి గ్రామంలో అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలను విన్నాని చెపప్ారు. 'నేను ఉన్నానని మాట ఇచ్చాను. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తొలి అడుగు వేశాను' అన్నారు.గత టీడీపీ హయాంలో అగ్రిగోల్డ్‌ స్కామ్‌ బాధితులకు న్యాయం జరగలేదని జగన్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితుల తరఫున పోరాటం చేశామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అండగా నిలబడుతున్నామని చెప్పారు. అంతేకాదు ఇప్పటి వరకు తమ పేరు నమోదు చేసుకోని అర్హులైన అగ్రిగోల్డ్‌ బాధితులకు మరో అవకాశం కల్పిస్తామన్నారు జగన్. బాధితులు నెల రోజుల్లోగా జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవచ‍్చని.. ఎమ్మార్వో, గ్రామ సచివాలయాల్లో కూడా నమోదు చేసుకోవచ‍్చని ప్రకటించారు.
కడప జిల్లాల్లో
కడప జిల్లాల్లో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకొనేందుకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితులందరు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్న నమ్మకంతో ఓట్లేశారని, అందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్‌లోనే బాధితులకు కేటాయింపులు చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితుల జీవితాలతో ఆడుకుందని, ఉపశమన కమిటీ పేరుతో కాలాయాపన చేసిందని మంత్రి తెలిపారు. తాను కూడా బాధితుల తరుపున పొరాడానని, డబ్బులు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సృష్టి టీడీపీ కుట్ర అని, ఆస్తులు ఉన్నా.. వాటిని కొట్టేసే ఉద్దేశంతోనే చంద్రబాబు బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్‌ విశ్వసనీయత ఉన్న నాయకుడని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని, బాధితుల కుటుంబాలలో సీఎం సంతోషాన్ని నింపుతారని పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం సీఎం వైఎస్‌ జగన్‌కు రెండు కళ్లు అని, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త పథకాలను చూస్తారని మంత్రి వెల్లడించారు

No comments:

Post a Comment