Breaking News

05/11/2019

మానవత్వం లేని ప్రభుత్వం ఇది

విజయవాడ నవంబర్ 5, (way2newstv.in)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళవారం జరిగిన పార్టీ పరిశీలకుల శిక్షణా శిబిరంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి న టిడిపి రాష్ట్ర పార్టీ నాయకులు, సంస్థాగత ఎన్నికల పరిశీలకులు హజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ ఇసుక నిల్వలు వరదల్లో కొట్టుకుపోయాయని మంత్రి సురేష్ వ్యాఖ్యలుబాధ్యతారాహిత్యమని అన్నారు. ఇసుక నిల్వలు వరదల్లో కొట్టుకు పోయాయా, లేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కొట్టుకుపోయాయా..? ‘‘కాలం చెల్లి చనిపోయారని’’ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్మికులను అవమానించారు.  ఉరేసుకుని చనిపోవడం కాలం చెల్లడమా..? భవనంపై నుంచి దూకడం కాలం చెల్లడమా..? పురుగుమందు తాగి చనిపోవడం కాలం చెల్లడమా..అని ప్రశ్నించారు.మంత్రుల వ్యాఖ్యలు సీఎం జగన్వ్యా ఖ్యానాలే.. బాధ్యతారా హిత్యానికి వైసిపి నేతలే మారుపేరు. 
మానవత్వం లేని ప్రభుత్వం ఇది

ఏమాత్రం మానవత్వం లేని ప్రభుత్వం ఇది. చనిపోయినవారిని కూడా అవమానించే ప్రభుత్వం ఇదని విమర్శించారు. ఒక వ్యక్తి మారితే ఇంత అరాచకమా..? చరిత్రలో చాలామంది ముఖ్యమంత్రులు మారారు.  కొంతమంది ప్రజాదరణ పొందారు, కొందరు ప్రజాదరణ పొందలేదు. ఎవరూ ఇంత డేమేజి రాష్ట్రానికి చేయలేదు.  చేతకాని పాలనకు ఇసుక కొరత-కార్మికుల అత్మహత్యలే ఒక కేస్ స్టడి.  ఎంత ఆవేదనకు లోనైతేఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటారు. ఈ రోజు భవనంపై నుంచి దూకి ఒకరు ఆత్మహత్య. ఉరివేసుకుని ఇంకొకరు ఆత్మహత్య.10రోజుల్లో 40మందిపైగా ఆత్మహత్యలు చేసుకోవడం, వైసిపి నేతల అరాచకాలకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఇసుక కొరతకు నిరసనగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది టిడిపినే. ఆగస్ట్ 30న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేశాం, అక్టోబర్ 25న రాష్ట్రవ్యాప్త నిరసనలు చేశాం. విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ కు మద్దతిచ్చాం. ఎవరు ఆందోళనలు చేసినా టిడిపి సంఘీభావంగా ఉంటుంది. వచ్చే వారం ఇసుక కొరతపై 12గంటల దీక్ష చేస్తాం.  అప్పట్లో వనజాక్షి అంశంపై దుష్ప్రచారం చేశారు. డ్వాక్రా మహిళలు, అధికారిణి మధ్య వివాదాన్ని రాజకీయం చేశారు. చింతమనేని ప్రభాకర్ పై అక్కసుతో టిడిపిని టార్గెట్ చేశారని అన్నారు.దానిపై వన్ మ్యాన్ కమిషన్ వేశాం, పరిస్థితిని చక్కదిద్దాం. టిడిపి 5ఏళ్ల పాలనలో అదితప్ప మరో సంఘటన జరగలేదు. టిడిపి పాలనలో ఇసుక, మట్టి ఉచితంగా తీసుకెళ్లమన్నాం. దీనివల్ల నిర్మాణాలన్నీ శరవేగంగా జరిగాయి, లక్షలాది మందికి ఉపాధి వచ్చింది. ఈ 5నెలల్లోనే వైసిపి నేతల విధ్వంసానికి హద్దు అదుపు లేకుండా పోయింది.  వైసిపి నేతల ఇసుక దోపిడి పేట్రేగి పోయింది. రాష్ట్రంలో ఇసుక కొరత జఠిలంగా మారింది. అనేక వృత్తులవారు జీవనోపాధి కోల్పోయారు.  తాపీ కార్మికులు, రాడ్ బైండింగ్ పనివాళ్లు, ట్రాన్స్ పోర్ట్ కార్మికులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, స్టీల్, సిమెంట్ లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులు ఉపాధి పోయింది.ఇసుక కొరత కార్మికుల ఆత్మహత్యలపై జాతీయ మీడియా ఎండగట్టింది.  జాతీయ మీడియాపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఉచిత ఇసుక పంపిణీ అన్ని సమస్యలకు పరిష్కారం. పరిహారం ఇస్తే వాళ్లందరిలో విశ్వాసం పెరుగుతుంది, ఒక నమ్మకం పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్ధికసాయం ఇచ్చాం.  మగ్గం గుంతల్లోకి వరదనీరు వస్తే చేనేతకార్మికులకు ఆర్ధిక సాయం ఇచ్చాం. విపత్తులలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చాం. అలాగే భవన నిర్మాణ కార్మికులకు పరిహారం ఇవ్వాలి.  నెలకు రూ.10వేల చొప్పున కార్మికులకు అందజేయాలి. ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి.  ఎన్ .ఏ.సి. కింద అసంఘటిత కార్మికుల సంక్షేమ నిధిని మనమే తెచ్చాం. దానికింద పుష్కలంగా నిధులు ఉన్నాయని అన్నారు.అందులోనుంచి నిధులిచ్చి కార్మికులను ఆదుకోడానికి వైసిపి నేతలకు చేతులు రావడంలేదు.  జాతీయ జెండాకు వైసిపి రంగులేయడం పరాకాష్ట. జాతీయ జెండానే అవమానించారు, అగౌరవం చేశారు. వినాయకుడి విగ్రహం తీసేసి వైఎస్ విగ్రహం పెట్టారు. జాతీయ జెండా రంగులు తుడిచేసి వైసిపి రంగులేశారు. అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్ పేరు పెట్టారు. జీవోలు ఇవ్వడం, మళ్లీ వాటిని రద్దు చేయడం ఎప్పుడైనా ఉందాని నిలదీసారు. ఉన్నఫళంగా సీఎస్ ను బదిలీ చేస్తారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. కోడెల ఆత్మహత్య వైసిపి వేధింపులకు పరాకాష్ట. 150రోజుల్లో 630అరాచకాలకు పాల్పడ్డారు. ‘‘ఛలో ఆత్మకూరు’’ ఆందోళనలతో కార్యకర్తల్లో ధైర్యాన్ని ఇచ్చాం, నమ్మకాన్ని కలిగించాం.  ప్రతి గురువారం అడ్వకేట్లతో భేటి అవుతున్నాను.  కార్యకర్తలపై అక్రమ కేసులను లీగల్ సెల్ సమగ్రంగా పరిశీలిస్తోంది. కార్యకర్తలకు పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని అన్నారు.

No comments:

Post a Comment