Breaking News

05/11/2019

అయోధ్య కేసులో తీర్పు…అప్రమత్తమైన భద్రతా దళాలు

న్యూఢిల్లీ నవంబర్ 5, (way2newstv.in)
రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు ఏరోజైనా తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యూపీకి భారీ ఎత్తున పారా మిలిటరీ బలగాలను పంపాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 15 కంపెనీల అదనపు పారా మిలిటరీ దళాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 
అయోధ్య కేసులో తీర్పు…అప్రమత్తమైన భద్రతా దళాలు

అయోధ్య, మథుర, కాశీ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిఘా వర్గాల బృందం అయోధ్యలోనే వుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షుస్తుంది.ఈ నెల 11న ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలకు చెందిన సాయుధ బలగాలను యూపీకి పంపించనున్నారు. ఈ బలగాలను సున్నిత ప్రాంతాలైన వారణాసి, కాన్పూర్, ఆజంఘడ్, అలీఘర్, లక్నో తదితర 12 ప్రాంతాల్లో మోహరింపజేయనున్నారు. ఉన్నతాధికారుల సెలవులను కుడా ఈ నెలాఖరువరకు రద్దు చేసారు.

No comments:

Post a Comment