వనపర్తి నవంబర్ 5, (way2newstv.in)
అబ్దులపూర్ మేట్ మండలంలోని తహశిల్దార్ ను సజీవదహనం చెయ్యటం దుర్మార్గమని దీనిని రేవలి మండల సర్పంచుల సంఘం ఖండించింది. ఈ సందర్బంగా మీడియా తో వారు మాట్లాడుతూ గెజిటెడ్ అధికారికి కూడా జీవితంపై నమ్మకం లేని రోజులు దాపురించాయని, సమాజంలో ఉన్మాదం తో అలజడి తీవ్రస్థాయికి చేరుకుంటుంద, నిజంగానే భూమి కోసం హత్య చేసాడని సమర్దించుకుంటే భూమి ఎలాగో తను పొందవచ్చు చట్టాలు ఉపయోగించుకోని తిరిగి పోందవచ్ఛని అనారు.
విజయ రెడ్డి హత్య అతి దారుణం
ఇలా ఉన్మాద చర్యల వల్ల మరణించిన విజయ పిల్లలకు తల్లిని తెచ్చివ్వగలరా అన్ని ప్రశ్నించారు. ఈఘటన పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యతిసుకోన్ని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నాగఫూర్ సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డి, గోల్లపల్లి సర్పంచ్ సునీల్ కుమార్, శానాయిపల్లి సర్పంచ్ లక్ష్మీ, పాత తాండ సర్పంచ్ గౌడనాయక్ ,బండరాయి పాకుల సర్పంచ్ లచమ్మ, తల్పునూర్ సర్పంచ్ షాయినాజ్ బేగం పాల్గొన్నారు.
No comments:
Post a Comment