Breaking News

21/11/2019

బుక్ ఫెయిర్ ను ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి నవంబర్ 21 (way2newstv.in)
పుస్తకాల ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేసేలా వనపర్తి పట్టణంలో బుక్ ఫెయిర్ ను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు.        ఈ మేరకు  ఆమె తన ఛాంబర్లో బుక్ ఫెయిర్ నిర్వహణ విషయమై జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు బీ. లక్ష్మయ్య, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.వనపర్తి జిల్లా విద్యారంగానికి, సాహిత్యం, కలలు, సంస్కృతికి మంచి పేరుందని, ఈ ప్రాంతంలో బుక్ ఫెయిర్ నిర్వహించడం వల్ల విద్యార్థులకు, పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అందువల్ల అన్ని రకాల పుస్తకాలతో కనీసం నాలుగైదు రోజులపాటు బుక్ ఫెయిర్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 
బుక్ ఫెయిర్ ను ఏర్పాటు చేయాలి

బుక్ ఫెయిర్ నిర్వహణకు అనువైన స్థలాన్ని, బుక్ ఫెయిర్ లో ఏర్పాటు చేసే పుస్తకాల పబ్లిషర్స్ ను గుర్తించాలని ఆమె కోరారు. ఈ బుక్ ఫెయిర్ లో విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షల పుస్తకాలు, చిన్నపిల్లల కథల పుస్తకాలు, నవలలు, సాహిత్యం, సంస్కృతి, ఆధ్యాత్మిక, ఇతర అన్ని రకాల పుస్తకాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అవసరమైతే నేరుగా పబ్లిషర్ లతో మాట్లాడి వనపర్తి పట్టణంలో బుక్ ఫెయిర్ ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించాలని ఆమె సూచించారు. ఈ బుక్ ఫెయిర్ నిర్వహణలో జిల్లా ప్రజలలో పుస్తకపఠనం పై ఆసక్తి కలుగుతుందని, అంతేకాక వివిధ రకాల పుస్తకాలు ఒకే చోట కొనుగోలు చేసేందుకు అవకాశం దొరుకుతుందని ఆమె అన్నారు. సాధ్యమైనంత త్వరలో బుక్ ఫేర్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు.        జిల్లా పౌరసంబంధాల అధికారి యు. వెంకటేశ్వర్లు, డి ఈ ఓ సుశీంధర్ రావు, డి ఈ ఐ వో, మద్దిలేటి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

No comments:

Post a Comment