Breaking News

07/11/2019

అర్చకుల ఎదురుచూపు ఫలించింది

తిరుమల నవంబర్ 7  (way2newstv.in)
టిటిడి ఆగమ సలహా మండలి సభ్యులుగా నియమించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు రమణ దీక్షితులు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే ప్రధాన అర్చక పదవి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు రమణ దీక్షితులు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆనాది కాలంగా నాలుగు కుటుంబాల అర్చకులు తరిస్తూ వచ్చారన్నారు. ముస్లిం, బ్రిటిష్ కాలంలో కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా పూజా కైంకర్యాలును నిరంతరంగా నిర్వహించామన్నారు.
అర్చకుల ఎదురుచూపు ఫలించింది

1987 వంశపార్యపరంగా వస్తూన్న హక్కులును రద్దు చెయ్యడంతో ఎన్నో దేవాలయాలు మూతపడ్డాయని అన్నారు. 2007 లో రాజశేఖర్ రెడ్డి చట్టానికి సవరణ చేస్తూ మార్పులు తీసుకు వచ్చి ఆలయాలు పునరుద్దరణకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఆగమశాస్ర్తం లో లేని విధంగా అర్చకులుకు రిటైర్మెంట్ అమలు చేయడాన్ని తప్పుబట్టారు. అర్చకుల ఎదురుచూపు ఫలించి జగన్ సిఎం అయ్యారని చెప్పారు.అర్చక కుటుంబాలను రక్షిస్తున్న జగన్ మరో ముప్పై సంవత్సరాలు వరకూ సిఎం పదవిలో కోనసాగాలని కోరుతున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment