`డాన్‌శీను`, `బలుపు` వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందనుంది. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. రవితేజ 66వ చిత్రమిది. రవితేజ ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ మూవీలో తమిళ నటుడు సముద్ర ఖని
దర్శకత్వం నుండి నటన వైపు అడుగులేసి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటూ వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న సముద్రఖని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. బలుపు వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరోసారి శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు: రవితేజ, శృతిహాసన్, సముద్రఖని తదితరులు
No comments:
Post a Comment