Breaking News

06/11/2019

ఆరోగ్యశ్రీకి భారీ నిధులు

ఏలూరు  నవంబర్ 4  (way2newstv.in)
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి రూపాయలు పైబడిన వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఏపీ ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.దివంగత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారుి గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందని మంత్రి అన్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి పెద్దఎత్తున నిధులు కేటాయించినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 
ఆరోగ్యశ్రీకి భారీ నిధులు

నవంబరు ఒకటో తేదీ నుంచి ఇతర రాష్ట్రాల హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి మహానగరాల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చిందని మంత్రి  నాని చెప్పారు .పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుగా జనవరి 1 రాష్ట్ర ప్రభుత్వం  అమలు చేయనుంది .  నాలుగు 108 వాహనాలు ద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినట్టు మంత్రి పేర్కొన్నారు.రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటల్ లో పేద ప్రజలకు వైద్యం చేయించుకునే సదుపాయం కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి దక్కుతుందని.ఈ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.  సోమవారం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పలువురు  ఆళ్ల నాని ని కలిసి ఆరోగ్యశ్రీ వైద్య సేవల గురించి విన్నవించుకున్నారు.సమస్యలు సానుకూలంగా విని సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. వివిధ రకాల సమస్యలపై సోమవారం ఉప ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయానికి ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు.

No comments:

Post a Comment