విశాఖపట్నం నవంబర్ 5 (way2newstv.in)
ప్రతిభ పురస్కారానికి అబ్దుల్ కలామ్ పేరు మార్చడం సమంజసం కాదు. దేశానికి మిసైల్ పరిజ్ఞానం ఇచ్చిన మహనీయులు కలామ్. ఆయన పేరిట ఉన్న పురస్కారానికి సీఎం నాన్న పేరు ఎలా పెడతారని జపసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మంగళవారం అయన విశాఖ జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
జీవో ఇచ్చినవారిని సస్పెండ్ చేయాలి
మీ నాన్న పేరు చాలా పథకాలకు పెట్టారు కదా. కావాలంటే కొత్త పథకాలకు పెట్టుకోండి. జాతికి సేవలు చేసినవారిని గౌరవించడం తెలియదా... వారికి ఇచ్చే మర్యాద ఇదేనా. జాతీయ పతాకాన్ని గౌరవించ లేని వారికి జాతికి సేవ చేసిన వారి విలువ ఏం తెలుస్తుందని అన్నారు. ప్రజా వ్యతిరేకత చూసి పొద్దున్నే - నాకు తెలియదు అంటున్నారు.. ఆ జీవో ఇచ్చిన వారిని తక్షణం సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయలేదు అంటే ప్రభుత్వం జాతికి సేవ చేసిన వారికి ద్రోహం చేసినట్లేనని అయన వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment