హైద్రాబాద్, నవంబర్ 1 (way2newstv.in)
దండుమల్కాపూర్‌లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. హైదరాబాద్-విజయవాడ రహదారి పక్కన పైలాన్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఇందులో 450 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దేశంలోనే తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా అభివర్ణిస్తోన్న ఈ పార్కు నిర్మాణానికి రూ.1,553 కోట్లు, 1246 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటికే రెండు విడతల్లో భూమిని సమీకరించారు. తొలి విడతలో 450 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ పార్కు కోసం రూ. 29 కోట్లతో రోడ్లను విస్తరించారు. రూ.6 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను, మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.
యువత ఉపాధే లక్ష్యం : కేటీఆర్
ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఈ పార్కును ఏర్పాటు చేశామన్నారు. పారిశ్రామిక విధానంలో టీఎస్ ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్న కేటీఆర్.. 15 రోజుల్లో అనుమతులు రాకుంటే డీమ్డ్ అప్రూవల్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 12 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.ఈ పార్కులో తక్కువ ధరకే మౌలిక వసతులు కల్పిస్తామని.. పార్కును 2 వేల ఎకరాలకు విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఇందులో పరిశ్రమలు ఏర్పాటు చేసే మహిళలకు ప్రత్యేక కోటా కేటాయిస్తామన్నారున్ ఇండస్ట్రియల్ పార్క్ సాకారం చేసేందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. ః. పారిశ్రామిక విధానంలో టీఎస్‌ఐపాస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ నాయకులకు పాలన వచ్చా అని ఎగతాళి చేసినవాళ్లే ఇవాళ మన విధానాలను అనుసరిస్తున్నారన్నారు. మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చాం. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. 15 రోజుల్లో అనుమతులు రాకుంటే డీమ్డ్ అప్రూవల్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదన్నారు.అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పరిశ్రమల విషయంలో తెలంగాణ అనుసరిస్తోన్న విధానం రేపు దేశంలోని అన్ని రాష్ర్టాలకు రోల్‌మోడల్ అవుతుంది. ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా నిలబడుతోంది. 70 శాతం ఉద్యోగాలు ఇచ్చేది ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలే. ఎంఎస్‌ఎంఈకి పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నామని చెప్పారు. పార్క్ కు సంబంధించి . అంతర్గత రోడ్డు, కరెంట్, నీటి వసత వేగంగా పూర్తిచేస్తాం. ఏ పరిశ్రమ ఏర్పాటు చేసినా మహిళలకు ప్రత్యేక కోటా కేటాయిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు దగ్గర 132 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభిస్తాం. వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేశాం. సంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశాం. ప్లాస్టిక్ పార్క్, మైక్రో ప్రాసెసింగ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు.
No comments:
Post a Comment