రాష్ట్ర సీఎం ఒ.ఎస్.డి ప్రీయాంక వర్గీస్
పెద్దపల్లి నవంబర్ 19 (way2newstv.in)
పెద్దపల్లి నవంబర్ 19 (way2newstv.in)
స్వచ్చ గ్రామంగా సుద్దాలను తీర్చిదిద్దతున్నారని రాష్ట్ర సీఎం ఓ.ఎస్.డి ప్రియాంక వర్గీస్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో హరితహారం, పారిశుద్ద్యం అంశాలను పరిశీలంచడానికి మంగళవారు ఆమె పర్యటించారు. ఒ.ఎస్.డిని ముగ్దుంపూర్ గ్రామం వద్ద జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన స్వాగతించారు. అనంతరం సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామంలో ఎర్పాటు చేసిన వానర వనం పరిశీలించిన ఓ.ఎస్.డి , అక్కడి పనివారితో మాట్లాడి నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. గ్రామంలో ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత, కాంపోస్ట్ పిట్, మరుగుదొడ్డి, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసారు.
స్వచ్చ గ్రామంగా సుద్దాల
పెద్దపల్లి జిల్లాలో పారిశుద్ద్యం, పచ్చదనం పెంపొందించడానికి రుపొందించి అమలు చేస్తున్న పంచసూత్రాల కార్యక్రమం గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటిలో ఇంకుడగుంత, మరుగుదొడ్డి, కిచెన్ గార్డెన్, 6 మొక్కలు, కాంపోస్ట్ పిట్, తడి చెత్త, పొడి చెత్త సేకరణ , సింగల్ యూసేజ్ ప్లాస్టిక్ నిషేదం, సబల శానిటరీ న్యాపకిన్ల వినియోగం వంటివి పరిశీలించి ఆ ఇంటికి పంచసూత్రాల స్టికర్ అంటిస్తున్నామని, వీటిని అందరు పాటించేలా కార్యచరణ రుపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. అనంతరం ఓఎస్డి ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని గ్రామాల్లో పారిశుద్ద్యం, పచ్చదనం యొక్క ఆవశ్యకత పై ప్రజలలో పూర్తి స్థాయి అవగాహన కల్పించడంలో యంత్రాంగం సఫలీకృతులయ్యారని అన్నారు. రాష్ట్రంలో గంగదేవరపల్లి ఆదర్శంగా గ్రామాలు అభివృద్ది బాట నడవాలని, పారిశుద్ద్యం పెంపొందించాలని సీఎం లక్ష్యంగా కృషి చేస్తున్నారని, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన నాయకత్వంలో స్థానిక ప్రజాప్రతినిధుల సంపూర్ణ సహాకరంతో పెద్దపల్లిలోని ప్రతి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా కృషి జరగడం చాలా అభినందనీయమని ప్రశంసించారు. గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ సైతం సమర్థవంతంగా పూర్తి చేసారని, ప్రతి మొక్కకు ట్రీ గార్డు ఎర్పాటు చేసారని, అదే విధంగా 1 సంవత్సరం పాటు వాటికి ప్రతి రోజు నీటి సరఫరా అందిస్తు నాటిన మొక్కలను బతికించాలని ఆమె సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పెద్దపల్లిలో పనిచేస్తున్నారని, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు. అనంతరం ఒఎస్డి జిల్లా పరిధిలో ఉన్న 60 కిలో మీటర్ల రాజీవ్ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. వాటిలో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ పూర్తి చేసుకోవాలని సూచించారు. 2 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న మొక్కలను రిప్లేస్ చేయాలని, ప్రతి ట్రీ గార్డుకు తెలంగాణకు హరితహారం బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎస్ఆర్ లో భాగంగా జిల్లాలోని ఎన్టిపిసి, ఆర్.ఎఫ్.సి.ఎల్, సింగరేణి, కేశవరాం సిమెంట్ సహాకరంతో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నామని కలెక్టర్ వివరించారు.
జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి ఉపెందర్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి రవిప్రసాద్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
No comments:
Post a Comment