Breaking News

19/11/2019

ప్రభుత్వాసుపత్రిని తనిఖీచేసిన ఆర్డిఓ బాల గణేష్

శానిటేషన్ సరిగా లేదంటూ అధికారులపై ఆగ్రహం
ఎమ్మిగనూరు    నవంబర్ 19 (way2newstv.in)          
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఉదయం ఆర్డీవో బాల గణేష్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఆస్పత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. ముఖ్యంగా  బాలింతల వార్డులో  శానిటేషన్ సరిగాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక డిప్యూటీ కలెక్టర్ ను నియమించడం జరిగిందని ఆ డిప్యూటీ కలెక్టర్లు ప్రతి వారము ఒక హాస్పిటల్ ని గాని, రెసిడెన్షియల్ హాస్టల్ ని కానీ, అంగన్వాడి సెంటర్ నీ కానీ, హై స్కూల్ ను లేదా ఎలిమెంటరీ స్కూల్ ను తనిఖీ చేసి ఏవైనా రిమార్కులు ఉన్న, సమస్యలు ఉన్న వాటిని ఆన్లైన్లో పెట్టమని కలెక్టర్ ఆదేశించారని  వారు తెలిపారు. 
ప్రభుత్వాసుపత్రిని తనిఖీచేసిన ఆర్డిఓ బాల గణేష్

అందులో భాగంగానే పట్టణంలోని  ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేయడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్ డి ఓ బాల గణేష్ మాట్లాడుతూ ఆన్లైన్లో మిషన్ కర్నూలు అనే ఒక స్కీం క్రింద డిప్యూటీ కలెక్టర్లు అందరూ వారు తనిఖీ చేసిన రిపోర్టులను ఆన్లైన్ లో పెట్టడం జరుగుతుందని వాటికి సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేము పంపిన రిపోర్టులకు,రిమార్కులకు స్పందిస్తూ వాటిని ఆన్లైన్ లో ఎక్కించడం జరుగుతుంది. వీటిని కలెక్టర్ రివ్యూ చేయడం జరుగుతుందని అన్నారు.డాక్టర్లు, ఉపాధ్యాయులు ఎవరైనా అవకతవకలు కానీ, ఇరెగ్యులర్ కాని,నెగ్లీజెన్సీ ఉంటే వాళ్లను 24గం.ల్లో లేదా 2రోజులలో వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని ఆయన అన్నారు.జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో  ఉపయోగకరంగా ఉన్నాయని,సమస్యలు కూడా త్వరగా పరిష్కారమయ్యాయని తెలిపారు.ఈ ప్రభుత్వ ఆసుపత్రిని సూపరిండెంట్ బాలయ్య ఆధ్వర్యంలో తనిఖీ చేశామని ఆసుపత్రి పురాతన బిల్డింగ్ కావడంతో రూఫ్ లీకేజీ ఉందని,జనరేటర్ ఉన్న అది సరిగా పనిచేయడం లేదని,డెంటల్ ఎక్సరే యూనిట్ అవసరమని,100ఎమ్.ఎమ్ ఎక్సరే ఉంది కాని అది పనిచేయక పోవడంతో 300 ఎమ్.ఎమ్ ఎక్సరే కావాలని డాక్టర్ బాలయ్య తనకు తెలిపారని అన్నారు.డాక్టర్ బాలయ్య  మాట్లాడుతూ డిజిటల్ ఎక్సరే,ఆసుపత్రిలో ఆర్.ఓ ప్లాంట్ ఉన్న అది సరిగా పనిచేయక పోవడంతో వార్డులో తగిన నీరు సరఫరా కావడం లేదని,హెచ్ డి ఎస్ నిధుల కింద వీటిని త్వరలోనే పూర్తి చేస్తామని ఆర్.డి.ఓ కు తెలియజేశారు.ఆపరేషన్ థియేటర్ లో పనిచేయుటకు స్టాఫ్ సరిగ్గా లేరని,మందులు కూడా తగినన్ని లేవని విటినన్నింటిని కలెక్టర్ కు తెలియజేస్తానని ఆర్.డి.ఓ బాలగణేష్ అన్నారు.ఈ కార్యక్రమానికి డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ,మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, డాక్టర్లు హేమంత్ కుమార్,తదితరులు హాజరయ్యారు.

No comments:

Post a Comment