Breaking News

19/11/2019

హాట్ ఫోటోలతో దుమ్ము రేపుతున్న ఈషా

హైద్రాబాద్, నవంబర్ 19, (way2newstv.in)
ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగమ్మాయిలు చాలా తక్కువగా ఒకరిద్దరు సక్సె్‌స్‌ అయినా గ్లామర్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న వారు మాత్రం లేరు. అయితే ఈ మధ్య టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆసక్తికర పాత్రల్లో నటిస్తున్న బ్యూటీ ఈషా రెబ్బ. సినిమాల్లో ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించే ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్‌లతో రెచ్చిపోతుంటుంది.తాజాగా ఈ విషయంపై స్పందించింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో అంత హుందాగా కనిపించే మీరు సోషల్ మీడియాలో మాత్రం ఎందుకు హాట్ ఫోటోలను ఫోస్ట్ చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా.. నాలో హాట్‌నెస్‌ ఉంది. కానీ మన మేకర్స్‌ దాన్ని చూపించటం లేదు. 
హాట్ ఫోటోలతో దుమ్ము రేపుతున్న ఈషా

అందుకే నేనే సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నా అంటూ సమాధానమిచ్చింది.తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలకు స్టీరియోటైప్‌ పాత్రలు మాత్రమే ఇస్తున్నారన్న ఇషా, నన్న ఎక్కువగా విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌, ట్రెడిషనల్‌ పాత్రలకే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాన గ్లామర్‌ యాంగిల్‌ను చూపించాలని ఇలా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నానని క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం ఈ భామ హీరోయిన్‌గా నటించిన రాగల 24 గంటల్లో రిలీజ్‌ రెడీ అవుతోంది. సత్యదేవ్‌, శ్రీకాంత్‌ (ఒకరికొకరు ఫేం), గణేష్‌ వెంకట్రామన్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  శుక్రవారం  రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈషా, తన కెరీర్‌, గ్లామర్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.థ్రిల్లర్‌ జానర్‌తో తెరకెక్కుతున్న రాగల 24 గంటల్లో సినిమాకు శ్రీనివాస్‌ రెడ్డి దర్శకుడు. రఘు కుంచే సంగీతమందిస్తుండగా అంజి సినిమాటోగ్రఫి బాధ్యతలు చూస్తున్నారు. హీరోయిన్‌గా మంచి పాత్రలో ఆకట్టుకున్న ఈషా ఈ సినిమాతో సోలో హీరోయిన్‌గా కమర్షియల్‌ సక్సెస్‌ దక్కుతుందన్న ఆశతో ఉంది.

No comments:

Post a Comment