Breaking News

19/11/2019

జగన్ ను సీఎం అనిపిలిస్తే... తప్పేంటీ

విజయవాడ, నవంబర్ 19, (way2newstv.in)
ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన లాంటి అంశాలపై.. జగన్ సర్కారును పవన్ లక్ష్యంగా చేసుకున్నారు. మీడియా ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో ద్వారా కూడా జనసేనాని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. సెప్టెంబర్ చివరి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒక్క ట్వీట్ కూడా చేయని పవన్.. ఆ తర్వాత ఆళ్లగడ్డలో యూరేనియం కోసం డ్రిల్లింగ్ విషయంలో స్పందించాలని తొలిసారి ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీశారు.
జగన్ ను  సీఎం  అనిపిలిస్తే... తప్పేంటీ

తర్వాత భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై ట్వీట్లు మొదలు పెట్టిన జనసేనాని.. లాంగ్ మార్చ్‌ కోసం వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వస్తున్న వార్తలు నిజం కాదంటూ ఓ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని లేదంటే వైఎస్ఆర్సీపీ అని కూడా రాయడానికి పవన్‌కు మనస్కరించడం లేదని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను జనసేనాని.. వైసీపీ నాయకుండంటూ మాట్లాడుతుండటం, ట్వీట్లు చేయడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. గతంలో చంద్రబాబును గౌరవ ముఖ్యమంత్రి సీబీఎన్ గారు అంటూ ట్వీట్లు చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వైఎస్ జగన్‌ను వైసీపీ నేత అని ట్వీట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంకయ్య నాయుణ్ని కూడా గౌరవ ఉపరాష్ట్రపతి అని పిలిచిన వ్యక్తి.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ను సీఎం అని పిలవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడని ప్రశ్నిస్తున్నారు.సెప్టెంబర్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు పవన్ చేసిన ట్వీట్లలో ఒక్కసారి కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ అని రాయకపోవడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.

No comments:

Post a Comment