Breaking News

21/10/2019

ఏపీలో మరో పోరుకు సిద్ధం

విజయవాడ, అక్టోబరు 21, (way2newstv.in)
ముఖ్యమంత్రి జగన్ ఇపుడు అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఏప్రిల్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన జగన్ కి గుమ్మంలోనే మరో కఠిన పరీక్ష సిధ్ధంగా ఉంది. అవే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిస్తేనే పట్టు కొనసాగినట్లు. అందుకోసమే జగన్ అనుక్షణం పరితపిస్తున్నారు. అలుపు సొలుపు లేకుండా పాలనను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దాదాపుగా అయిదు నెలల పాలన ముగిసింది. జగన్ తపన జనాలకు అర్ధమైనా కూడా ఆయన అమలు చేసే పధకాలు ఇంకా క్షేత్ర స్థాయికి చేరలేదు. మరో వైపు సర్కార్ ని ఘాటుగా విమర్శిస్తూ ప్రతిపక్షాలు, వాటికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేక మీడియా బలంగా జనంలోకి పోతుంది. 
ఏపీలో మరో పోరుకు సిద్ధం

దీనికి తోడు సహజంగానే మొదటి నుంచి జగన్ ని కొంతవరకూ వ్యతిరేకించే అర్బన్ ఓటర్లు ప్రభుత్వ తీరుని నిశితంగా గమనిస్తున్నారు.పట్నం పోరుకు జగన్ సర్కార్ రెడీ అంటోంది. ముందు పట్టణాలను గెలుచుకుంటే తరువాత పల్లెలను జయించవచ్చునని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తొందట. అంటే మున్సిపాలిటీలకు ఎన్నికలు ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది మొదట్లో కానీ ఎన్నికలు జరిపించాలనుకుంటోందట. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మునిసిపల్ శాఖ అధికారులు వర్తమానం పంపించారట. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు పెట్టాలనుకుంటున్నట్లుగా సర్కార్ బావిస్తోందని అంటున్నారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు పెట్టిన తరువాతం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీల ఎన్నికలు ఉంటాయట.సాధారణంగా పల్లెలతో పోలిస్తే పట్టణాలతో చైతన్యం ఎక్కువ. వారు ప్రతీ రోజూ టీవీలు, పేపర్లు చూస్తూ అన్ని విషయాలను విశ్లేషించుకుంటారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల పట్టణ ఓటర్లలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. అమరావతి అభివృధ్ధిని ఆపడం, పోలవరం రివర్స్ టెండరింగ్ వంటివి కూడా అర్బన్ ఓటర్లలో చర్చకు వస్తున్నాయి. ఇక జగన్ సర్కార్ నిర్ణయాల వెనక ఉన్న అసలు ఉద్దేశాల పైన కూడా అర్బన్ ఓటర్లు లోతైన చర్చ చేస్తూంటారు. దానికి తోడు అర్బన్లో టీడీపీకి పట్టుంది. మొదటి నుంచి టీడీపీ పట్ల వారు సానుభూతిగా ఉంటారు. జగన్ అవినీతి చేసి జైలుకి వెళ్ళాడని నమ్మే వారే ఎక్కువగా ఉంటారు. రాజకీయ కారణాలు ఏవైనా జగన్ విషయంలో అర్బన్ ఓటర్ల అభిప్రాయం మాత్రం పెద్దగా మారడంలేదు.ఇక దానికి విరుధ్ధంగా పల్లెల్లో మాత్రం వైసీపీ జెండా బాగానే ఎగురుతోంది. రైతులకు జగన్ చేస్తున్న కార్యక్రమాలు, సచివాలయాలు, సంక్షేమ పధకాలు ఇతర విషయాలు ఇలా అన్నీ చూసుకుంటే పల్లెజనం జై జగన్ అంటారెపుడూ, ఆయన తండ్రి వైఎస్సార్ పట్ల ఉన్న మమకారం, అభిమానం కూడా ఇక్కడ జగన్ కి అనుకూలం అవుతున్నాయి. అందువల్ల ముందుగా పల్లెలకు ఎన్నికలు పెట్టి పట్నాలకు పోతే ఆ ప్రభావం అక్కడ పడి విజయం సులువు అవుతుందని వైసీపీలో వినిపిస్తున్న మాట. కానీ జగన్ అతి విశ్వాసంతో ఉన్నారు, పట్నాలను కూడా తమవైపు మళ్ళించుకోగలమని అనుకుంటున్నారుట. మరి చూడాలి.

No comments:

Post a Comment