Breaking News

15/10/2019

పారిశుద్ధ్యంపై సీరియస్ గా ఉండండి

హైద్రాబాద్, అక్టోబరు 15 (way2newstv.in)
 అన్ని జిల్లాల కలెక్టర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ తీరును మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణపై వారం రోజుల్లో ప్రణాళిక రూపొందించి పురపాలక శాఖకు ఇవ్వాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. 
పారిశుద్ధ్యంపై సీరియస్ గా ఉండండి

స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలు ఉండాలి. పురపాలక సిబ్బందికి కూడా ప్రభుత్వమే బీమా సౌకర్యం కల్పించాలి. డంపింగ్‌ యార్డుల కోసం వెంటనే భూసేకరణ చేపట్టాలి. నగరాల్లో మరిన్ని షీ-టాయిలెట్లను నిర్మించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

No comments:

Post a Comment