Breaking News

01/10/2019

రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చాలి

అధికారులకు సిఎం జగన్ ఆదేశం
అమరావతి అక్టోబర్ 1  (way2newstv.in)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమంపై మంగళవారం సమీక్ష జరిపారు. రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణాకు ప్రభుత్వంధర కిలోమీటర్కు రూ.4.90 గా నిర్ణయించింది. నిర్ణీత ధరకు ఎవరు ముందుకు వచ్చినా వారిని తీసుకోవాలన్నారు. జేసీ స్థాయి అధికారికి జిల్లాల్లో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతఅప్పగించారు. వరదలు తగ్గాయని, ఇసుక లభ్యత ఉందని, తక్కువ ధరకు అందించాలని జగన్ ఆదేశించారు. వచ్చే 60  రోజుల్లో ఖచ్చితంగా మార్పు రావాలన్నారు. 
రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చాలి

అయితే వరదల కారణంగా ఇసుకను తరలించలేకపోతున్నామని కలెక్టర్లు చెప్పారు.ప్రతి జిల్లాలో  2  వేల మంది నిరుద్యోగులకు కార్పొరేషన్ల ద్వారా.. వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలని జగన్కలెక్టర్లను ఆదేశించారు. వారికి ఇసుక రవాణా కాంట్రాక్టు ఇచ్చేలా చూడాలన్నారు. మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా కలెక్టర్లు,ఎస్పీలు దృష్టిపెట్టాలని సూచించారు. గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా కనిపించాలన్నారు. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని జగన్ సూచించారు.చెక్పోస్టుల్లో నిఘాను పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. నవంబర్ నెలాఖరుకు గ్రామ సచివాలయాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని, జనవరి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లోదాదాపు 500  రకాలకు పైగా సేవలు పౌరులకు అందాలని సీఎం జగన్ అన్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో బోర్డులపై పెట్టాలని, జనవరి  1 నుంచి అర్హులందరికీకొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

No comments:

Post a Comment