Breaking News

01/10/2019

మళ్లీ పెరిగిన పెట్రోల్

హైద్రాబాద్, అక్టోబరు 1 (way2newstv.in)
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశీ ఇంధన ధరలు వరుసగా రెండో రోజు కూడా పైకి కదిలాయి. మంగళవారం పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 12 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 79.25కు, డీజిల్ ధర రూ.73.51కు చేరింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 13 పైసలు పెరుగుదలతో రూ.78.90కు చేరింది. 
మళ్లీ పెరిగిన పెట్రోల్

డీజిల్‌ ధర కూడా 12 పైసలు పెరుగుదలతో రూ.72.83కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 14 పైసలు పెరుగుదలతో రూ.78.54కు చేరింది. డీజిల్ ధర 12 పైసలు పెరుగుదలతో రూ.72.49కు ఎగసింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 19 పైసలు పెరుగుదలతో రూ.74.61కు చేరింది. డీజిల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.67.49కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 13 పైసలు పెరుగుదలతో రూ.80.21కు చేరింది. డీజిల్ ధర 12 పైసలు పెరుగుదలతో రూ.70.76కు ఎగసింది.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.81 శాతం పెరుగుదలతో 59.73 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.89 శాతం పెరుగుదలతో 54.55కు ఎగసింది.

No comments:

Post a Comment