Breaking News

23/10/2019

హుజూర్ నగర్ ఫలితాలు.. కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

సూర్యాపేట అక్టోబరు 23, (way2newstv.in)
సూర్యాపేట జిల్లాలోని  హుజూర్ నగర్  ఉప ఎన్నిక ఫలితాలు గురువారం  వెలువడనున్నాయి.  దీనికోసం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కౌంటింగ్  అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కు  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. కౌంటింగ్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.  
హుజూర్ నగర్ ఫలితాలు.. కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 22 రౌండ్లలో ఈవీఎంల లెక్కింపు నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్ కు  14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.  ఒక్కో టేబుల్  మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. మధ్యాహ్నాం 2గంటల లోపే ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

No comments:

Post a Comment