Breaking News

23/10/2019

రోజురోజుకు పెరుగుతున్న ఓల్డేజ్ హోం

నల్గొండ, అక్టోబరు 23, (way2newstv.in)
రాష్ట్రంలో ఓల్డేజ్ హోంల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. వందలాదిగా వృద్ధాశ్రమాలు ఉన్నా, రిజిస్టర్ అయినవి కేవలం 23 మాత్రమే. వీటిలో 18 కేంద్ర ప్రభుత్వం సాయంతో నడుస్తుండగా, మిగతా ఐదు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ తో నడుస్తున్నాయి. మిగిలిన ఆశ్రమాలకు ఎలాంటి పర్మిషన్లు లేవు. మొదట సేవా దృక్పథంతో ప్రారంభిస్తున్నఆశ్రమాల్లో కొన్నాళ్లకు వ్యాపార దృక్పథం పెరుగుతోందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం, వీటి నిర్వహణను క్రమబద్ధీకరించాలని నిర్ణయంచింది. ఇందులో భాగంగా ఓల్డేజ్ హోంలను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించింది.
రోజురోజుకు పెరుగుతున్న ఓల్డేజ్ హోం

కేంద్రం తెచ్చిన సీనియర్‌‌ సిటిజన్‌ మెయింటెనెన్స్‌‌ చట్టం–2007 ప్రకారం వంద నుంచి 150 మందికి ఆశ్రయమిచ్చేలా జిల్లాకో వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. మంచిర్యాల, ఖమ్మం జిల్లాకేంద్రాల్లో మాత్రమే డే కేర్ సెంటర్లున్నాయి. మిగతా ఏ జిల్లాల్లోనూ ఇలాంటివి లేవు. అధికారులు జిల్లాల్లో ఓల్డేజ్ హోంలు ఏర్పాటు చేయకపోగా, ప్రైవేటు వృద్ధా శ్రమాలను పర్యవేక్షించడం మానేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించడం లేదనే భావనతో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న ఆశ్రమాల వైపు కన్నెత్తి చూడడం లేదు. వృద్ధ, అనాథాశ్రమాల్లో ఫైర్ సేఫ్టీ, ఫుడ్డూ, బెడ్డు, బాత్రూమ్ లు, టాయిలెట్లు ఎలా ఉన్నాయనే దానిపై ఏడాదిలో ఒక్క సారైనా తనిఖీ చేయడం లేదు. హైదరాబాద్ లోనే  1,000 హైదరాబాద్ నగరంలోనే సుమారు వెయ్యికి పైగా వృద్ధాశ్రమాలున్నాయి. కొందరు ఒకే పేరుతో నగరంలో పలుచోట్ల బ్రాంచ్ లు ఏర్పాటు చేశారు. వాటిలో రిటైర్డ్ ఎంప్లాయిస్, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల తోపాటు ఎక్కువగా ఎన్నారైల పేరెంట్స్ ఉంటున్నా రు. ఒక్కొక్కరి నుంచి ప్రతినెల రూ.15 వేల నుంచి రూ.35 వేల వరకు వసూలు చేస్తున్నారు. అడ్వాన్స్ డిపాజిట్ గా రూ.20 వేల నుంచి రూ.40 వేలు, మెడికల్ డిపాజిట్ గా రూ.5 వేల నుంచి రూ.15 వే లు వసూలు చేస్తున్నారు. ఏసీ, డాక్టర్, నర్సింగ్ వంటి సౌకర్యాలు వినియోగించుకుంటే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని సౌకర్యాలు ఉంటేనే వృద్ధాశ్రమాలకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే దాతలు, ఆశ్రయం పొందుతున్న వారి వివరాలను తెలపాలని స్పష్టం చేసింది.స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓల్డేజ్ హోమ్ లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి.  వెబ్ సైట్ నుంచి ఫామ్–ఎం డౌన్ లోడ్ చేసుకుని ఈ నెల 28లోగా జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో నమోదు చేయించి, గుర్తింపు పత్రం తీసుకోవాలి. నమోదు చేయని సంస్థలపై కఠిన చర్యలతో పాటు, రూ.25,000 జరిమానా విధిస్తామని వయోవృద్ధుల సంక్షేమ శాఖ కమిషనర్  తెలిపారు.

No comments:

Post a Comment