Breaking News

25/10/2019

సీఎం జగన్ భార్యతో మహేశ్ బాబు సతీమణి భేటీ

అమరావతి, అక్టోబర్ 25 (way2newstv.in):
ఏపీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతిని టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు సతీమణి నమ్రత కలిశారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, గ్రామంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను భారతికి నమ్రత వివరించారు. శ్రీమంతుడు సినిమా తర్వాత దత్తత కాన్సెప్ట్ ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు.. 
సీఎం జగన్ భార్యతో మహేశ్ బాబు సతీమణి భేటీ

తెలంగాణలో ఒక గ్రామంతోపాటు ఏపీలో తన తండ్రి స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. గ్రామంలో పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, రోడ్లు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం తదితర విషయాల్లో మహేష్ బాబు కార్యక్రమాలు చేపడుతున్నారు.  గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందించాలని కోరారు. మరోవైపు, తమ ఇంటికి వచ్చిన నమ్రతకు భారతి సాదర స్వాగతం పలికారు. పలు అంశాలపై చర్చించుకున్నారు.

No comments:

Post a Comment