Breaking News

04/10/2019

మహాలక్ష్మి రూపంలో కనకదుర్గమ్మ

కరెన్సీనోట్లతోఅలంకారం
మంత్రాలయం అక్టోబర్ 4 (way2newstv.in):
దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆర్యవైశ్య మండపంలో కనకదుర్గమ్మ శుక్రవారం భక్తులకు మహాలక్ష్మీ  రూపంలో దర్శనమిచ్చారు.  నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హెచ్ఆర్ బి మండపం పక్కన ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అమ్మవారికి అర్చకులు గౌతమ్ ఆచార్  ఆధ్వర్యంలో  ఆర్యవైశ్యులు విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికినిర్మాల్యము విశేష పుష్పాలంకరణ గావించి కుంకుమార్చన చేశారు.విశేష ఫలపంచాబృతం గావించారు.
మహాలక్ష్మి రూపంలో కనకదుర్గమ్మ

అనంతరం అమ్మవారి విగ్రహం చుట్టూ కరెన్సీ నోట్లతో చూడముచ్చటగాఅలంకరించారు. భక్తులు శుక్రవారం మహాలక్ష్మి రూపంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకుని పునీతులయ్యారు. సాయంత్రం ఆర్యవైశ్యల ఆధ్వర్యంలో లక్ష్మీ శ్రీనివాస కళ్యాణంవైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.మహాలక్ష్మి రూపంలో గ్రామదేవత మంచాలమ్మ   మంచాల గ్రామ దేవత అయిన మంచాలమ్మ అర్చకులు మహాలక్ష్మి రూపంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. తుంగభద్రానది తీరాన వెలసిన గ్రామదేవత మంచాలమ్మ శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేష పూజలు నిర్వహించి కరెన్సీ నోట్లతో అలంకరిచారు. భక్తులు మహాలక్ష్మి రూపంలో ఉన్నమంచాలమ్మ అమ్మవారిని  దర్శించుకుని పునీతులయ్యారు.

No comments:

Post a Comment