కామారెడ్డి అక్టోబర్ 4(way2newstv.in):
కామారెడ్డి జిల్లా లోని తాడ్వాయి మండలం కృష్ణాజివాడ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము నిధులతో నిర్మించిన వైకుంఠ దామం పనులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనుల తో పాటు డంపింగ్ యార్డ్నిర్మాణము, వైకుంఠ గ్రామం నిర్మాణానికి స్థల సేకరణ అనువైన ప్రదేశాలలో వైకుంఠధామం నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో 30 రోజులప్రణాళికలో గ్రామాలన్నీ పచ్చదనంతో అందంగా తయారవుతున్నాయి అని కలెక్టర్ అన్నారు.
వైకుంఠ దామం' కు ప్రారంభోత్సవం చేసిన కలెక్టర్
కృష్ణాజివాడ గ్రామంలో వేగంగా వైకుంఠ దామం పనులను పూర్తి చేసినందుకు గ్రామసర్పంచ్ ను ఉపాధిహామీ సిబ్బందిని అభినందించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పవర్ వీక్ నిర్వహించడం జరిగిందని, వీధి దీపాలకు ఆన్ ఆఫ్ స్విచ్ లను ఏర్పాటు చేయడంజరిగిందని, అన్ని గ్రామాల్లో చెత్త సేకరణ కోసం రిక్షాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అటవీ ప్రాంతాలలో ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించి కోతులకు ఆహారంగా ఉండే చెట్లను నాటి మంకీఫుడ్ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 15 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులతో గ్రామాలలో అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రవి, ఎంపీడీవో లక్ష్మి, గ్రామ సర్పంచ్ భూషణం,ఎంపీటీసీ శాంతాబాయి,ఉప సర్పంచ్,వార్డు సభ్యులతో పాటు ఉపాధిహామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment