ఎమ్మెల్యే తొగురు ఆర్థర్
నందికొట్కూర్ అక్టోబర్ 25, (way2newstv.in):
గ్రామ వలంటీర్లు పారదర్శకంగా పనిచేసి ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలని నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు తొగురు.ఆర్థర్ అన్నారు. శుక్రవారం జూపాడు బంగళా మండల కేంద్ర కార్యాలయంలో గ్రామ వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి గడపకు పాలనను అందించాలని ఆదేశించారు.
గ్రామ వలంటీర్లు పారదర్శకంగా పనిచేసి ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలి
గ్రామ వలంటీర్లు బాధ్యతాయుతంగా పని చేసి ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ వర్తింప చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశ గా అడుగులు వేస్తోంది అని, కావున అందరూ ఉద్యోగులు, ముఖ్యంగా వాలంటీర్స్ కలిసి రావాలని కోరారు. అర్హులైన వారికి పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా, ఆటోవాలలకు వాహన మిత్ర పథకాలు వర్తింపజేయాలని సూచించారు. అంతేకాకుండా గ్రామాల్లో పార్టీలకతీతంగా సేవలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో మండల అధికారులు, సిబ్బంది, మండల ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment