Breaking News

10/10/2019

విశాఖలో టీడీపీ కుంపట్లు

విశాఖపట్టణం, అక్టోబరు 10 (way2newstv.in)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటనకు చేపట్టారు. రెండు రోజుల పాటు ఆయన విశాఖలోనే వుంటారు. మొత్తానికి మొత్తం పదిహేను నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. దీంతో రాజకీయ వర్గాల్లోనే కాదు, టీడీపీలోనూ ఇపుడు ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. చంద్రబాబు మీటింగుకు ఎంతమంది వస్తారు, మ‌రెంతమంది డుమ్మా కొడతారు అన్నది పసుపు శిబిరంలో హాట్ టాపిక్ గా ఉంది. విశాఖ జిల్లా పార్టీకి ఇంఛార్జిగా ఉన్న మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విశాఖ వచ్చి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు సమీక్షించారు. అయితే ఈ మీటింగుకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాలేదు. అంతే కాదు అంతకు ముందు సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇతర నాయకులు పాల్గొన్న పార్టీ సమావేశాలకు కూడా గంటా గైర్హాజరయ్యారు. 
విశాఖలో టీడీపీ కుంపట్లు

చంద్రబాబు టూర్ దగ్గరపడిన నేపధ్యంలో గంటా వస్తారా రారా అన్నది ఉథ్కంఠంగా ఉంది.ఇదిలా ఉండగా విశాఖ జిల్లాకు చెందిన సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పార్టీ మీటింగులకు రావడం లేదు. దాంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు పైన పార్టీ సైతం సీరియస్ గా ఉందని అంటున్నారు. హై కమాండ్ కి ఎప్పటికపుడు జిల్లా పార్టీ సమాచారం చేరుతోందని పార్టీ నాయకులు అంటున్నారు. ఎవరు పార్టీలో ఉన్నా పోయినా కూడా క్యాడర్ బేస్డ్ పార్టీగా ఉన్న టీడీపీకి పోయిందేమీలేదని కూడా అంటున్నారు. వాసుపల్లి వ్యవహారం తీసుకుంటే ఆయన అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ రహమాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు నాయకుల మధ్య వర్గ పోరు ఉంది. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే పార్టీలో మిగులుతారని అంటున్నారు. చంద్రబాబు మరి ఇద్దరినీ కూర్చొబెట్టి నచ్చచెబుతారా లేదా అన్నది చూడాలని అంటున్నారు. చంద్రబాబు చెప్పినా కలసి నడచేందుకు ఇద్దరూ ఇష్టపడరని, కధ చాలా దూరం వచ్చిందని అంటున్నారు.పార్టీ ఎపుడు ఓడిపోయినా గంటా అందుబాటులో ఉండరని 2004 నాటి పరిణామాలను కూడా టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా మూడేళ్ళ పాటు పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అదే సమయంలో ప్రజారాజ్యం ఆవిర్భావం కావడంతో ఆయన ఆ పార్టీలో చేరిపోయారని అంటున్నారు. ఇపుడు కూడా గంటా కానీ ఆయన అనుచరులు కానీ కనీసం పార్టీ గుమ్మం తొక్కడంలేదని అంటున్నారు. గంటా వ్యవహారశైలి చూస్తే ఆయన చంద్రబాబు మీటింగుకు డుమ్మా కొడతారని కూడా జాతకం చెప్పేస్తున్నారు. ఒకవేళ గంటా వచ్చినా కూడా ఆయన టీడీపీలో ఉంటారని చెప్పలేమని కూడా అనేస్తున్నారు. ఓ విధంగా చంద్రబాబు టూర్ పార్టీలో జంపింగ్ జఫాంగులు ఎంతమంది ఉంటారన్నది తేల్చేందుకేనని కూడా అంటున్నారు. మరి చూడాలి చంద్రబాబు సముఖానికి ఎంతమంది వస్తారో.

No comments:

Post a Comment