Breaking News

31/10/2019

ప్రైమరి హెల్త్ సెంటర్లుకు క్యూ కడుతున్న జనాలు

హైద్రాబాద్, అక్టోబరు 31,(way2newstv.in)
రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేసి ప్రభుత్వ దవాఖానాలను, మండల గ్రామ స్థాయిల్లో ఉన్న ప్రైమరి హెల్త్ సెంటర్లను బలోపేతం చేయడానికి కృషి చేసింది. ప్రభుత్వ దవాఖానాల్లో అందుతున్న మెరుగైన వైద్యసేవలను ప్రజల దృష్టికి తీసుకుపోయారు. కేసిఆర్ కిట్లు పథకం వంటి ఆరోగ్యదాయక పథకాలతో ప్రతి పేదకి మెరుగైన వైద్యం అందించారు. కాని రంగారెడ్డి జిల్లా యాచారంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం బయటపడుతోంది. అడవిని తలపిస్తున్న పీహెచ్‌సీ పరిసరాలు, అభివృద్ధికి కేటాయించిన నిధులు పక్కదారి పట్టడం, హెచ్‌డిఎస్ నిధులను సిబ్బందితో కలిసి డిప్యూటీ డిఎం ఆండ్ హెచ్‌ఓ దారి మళ్లించారనే అరోపణలు దీనికి నిదర్శనం. రంగారెడ్డి జిల్లా యాచారం ప్రైమరి హెల్త్ సెంటర్‌లో 5మంది వైద్యులు ఉన్నప్పటికీ విధులకు హాజరయ్యేది ఒకరిద్దరే. 
ప్రైమరి హెల్త్ సెంటర్లుకు  క్యూ కడుతున్న జనాలు

నలుగురు స్టాప్‌నర్సులు ఉన్నప్పటికి వారు వారానికి ఒక్కరు చొప్పున విధులు నిర్వహిస్తుంటారు మిగిలిన రోజులు వారు విధులకు హజరుకాకున్నా నెలకు ఎటువంటి కటింగ్‌లు లేకుండా జీతాలు అందడంతో వారి ఇష్టారాజ్యంగా పిహెచ్‌సీ నడుస్తుందని, ప్రజలకు అందుతున్న సేవలు మాత్రం అంతంతగానే ఉంటున్నాయని పలువురు రోగులు వాపోతున్నారు. ఇక్కడ ఇంత తంతు నడుస్తూన్నా డిప్యూటీ  డిఎం ఆండ్ హెచ్‌ఓ సిబ్బందితో కుమ్మక్కై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రతినెల జీతాలు వచ్చిన అనంతరం వేలల్లో ముట్టచెప్పడం  పరిపాటిగామారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  పిహెచ్‌సీ అభివృద్దికి కేటాయించిన నిధులు అందినకాడికి స్వాహా చేయడంతో పిహెచ్‌సీ పరిసరాలు అడవిని తలపిస్తున్నాయి. డోర్లు పగిలిపోయి, కిటీకిల అద్దాలు పగిలిపోయి పిహెచ్‌సీ భవనం శిధిలావస్థకు చేరుకుంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రతి గర్భవతి మహిళకు ఎటువంటి రాజీలేని మేరుగైన వైద్యం అందించేందుకు ప్రైమరి హెల్త్ సెంటర్లలో సైతం అల్‌ట్రా సౌండ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు.  యాచారం పిహెచ్‌సీలో అల్‌ట్రా సౌండ్ మిషన్ ఉన్నప్పటికి ఇక్కడకు చికిత్సలకు వస్త్తున్న గర్భిణీలను ఇబ్రహింపట్నంలో ఉన్న ఒకప్రవేట్ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపి వారు ఇచ్చే కమిషన్‌లు దండుకుంటున్నారని పలువురు గర్భిణీలు తెలిపారు. పిహెచ్‌సీలో అల్‌ట్రా సౌండ్ మిషన్ ఉన్న విషయం తమకు తెలియదని అశ్చర్యం వ్యక్తం చేశారు. ఆఫరేషన్ ధియేటర్‌లో చికిత్సలు జరగవు. ధియేటర్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికి ఇక్కడ గత సంవత్సరం  కాలంగా ఒక్క ఆపరేషన్ చేసిన దాఖలాలు లేవు. రికార్డులకే పరిమితం . స్ట్టెరిలైజేషన్ మిషనరీ ఉన్నప్పటికి వాడక పోవడంతో ఎంతో ఖరీధైన మిషనరీ తుప్పుపట్టి నిరుపయోగంగా మారుతోంది. అడవిని తలపిస్తున్న పిహెచ్‌సీలోకి ఏకంగా పాములు  కప్పలు యధేచ్చగా వస్తున్నాయి. దీనితో వైద్యులు సిబ్బంది, రోగులు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఉన్నతాధికారి అయిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్  తనీఖీలు నిర్వహించకుండా నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారించడంతోనే యాచారం వంటి పిఒహెచ్‌సీలు ఇలాతయార వుతున్నాయని పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాచారం పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు తమకు ఆరోగ్య సమస్యలు వస్తే స్థానికంగా ఉన్న పిహెచ్‌సీలకు పోతే సరైన వైద్యం అందటం లేదని దీనితో ప్రవేట్దవాఖానాలకు అప్పులు చేసి బిల్లులు చెల్లిస్తూన్నామని ఆరోపిస్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని సదుపాయాలు కలిపించాలని రోగులు కోరుతున్నారు. ఈవిషయంపై అధికారుల వివరణ కోరటానికి ప్రయత్నించినప్పటికి వారు అందుబాటులో లేరు.  అవకతవకలు జరగకుండా పిహెచ్‌సీ సెంటర్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరిచి డ్యూటికి వచ్చిన సమయం, తిరిగి వెళుతున్న సమయంను డిహెచ్ కార్యాలయానికి అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపడితే  పిహెచ్‌సీల పనితీరు మారుతుంది, ప్రజలకు సమయానికి సరైన వైద్యం అందుతుందని స్థానిక ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా యాచారం పిహెచ్‌సీని డిహెచ్  తనీఖీలు నిర్వహించి దుర్భర పరిస్థితిలో ఉన్న భవనాన్ని సదుపాయాలను మెరుగుపరచాలని వారు కోరుతున్నారు.

No comments:

Post a Comment