Breaking News

31/10/2019

యదేఛ్చగా గంజాయి విక్రయాలు

కరీంనగర్, అక్టోబరు 31, (way2newstv.in)
జగిత్యాల జిల్లా జేఎన్‌టీయు ఇంజనీరింగ్ కాలేజీ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. ఇటీవలే  పోలీ సులు దాడులు నిర్వహించి కిలోన్నర గంజాయి స్వాధీనం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరి ధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్ట్ తీసుకుంటున్నారు. విశాఖ మ న్యంలో హైదరాబాద్‌కు వాహనాలలో అక్రమం గా  తరలిస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా నుంచి 200 కేజీల గంజాయిని పోలీసుల బృం దాలు స్వాధీనం చేసుకుంటున్న ఇలాంటి ఎన్నో సంఘటనలు మీడియాలో సంచనాలు సృష్టిస్తు న్నాయి. డ్రగ్ మాఫియాపై ప్రభుత్వాలు, పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ, ప్రింట్ మీడి యా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా చైతన్యం కలిగిస్తున్నప్పటికీ మారుమూల ప్రాం తాల్లో గంజాయి భూతం యువతను పట్టి పీడి స్తోంది. 
యదేఛ్చగా గంజాయి విక్రయాలు

విద్యార్ధుల జీవితాలను మత్తులో ముంచేస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని అడవి ప్రాం తాలు, అంతర్ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో గంజా యి మాఫియా రెచ్చిపోతోంది. మారుమూల  గ్రామాల్లోని యువతలో గంజాయి మత్తు ఆవహి స్తోంది. సులువుగా డబ్బుల సంపాదనే ధ్యేయం గా యువకులను మత్తులో ముంచుతున్న గంజా యి ముఠాలు. మత్తుకు బానిసగా మారిన యు వతను ఏజెంట్లుగా మార్చి వ్యాపార సామ్రాజ్యా న్ని విస్తరిస్తున్నాయిమాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించాయి. మాదక ద్రవ్యాలకు బానిసలు గా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా మానసికంగా నిర్వీర్వమైపోతున్నా రు. దుర్వ్యసనాల బారినపడుతూ యుక్త వయ సులోనే అనారోగ్యానికి గురవుతున్నారు. శరీర అంతర్భాగం తూట్లుతూట్లుగా మారిపోవడంతో జీవచ్ఛవాల్లా జీవిస్తున్నారు. తులసీవనం లాంటి అడవులలో గంజాయి మత్తెక్కిస్తోంది. రోజుల తరబడి మత్తులో ముంచెత్తే ఈ మహమ్మారి యువతను లక్ష్యంగా చేసుకుంటుంది. కళాశాల ల్లో చదివే విద్యార్థుల్లో చాలామంది ఈ అల వాటుకు బానిసవుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే చేయిదా టే ప్రమాదం ఉంది.గంజాయి, బిజినెస్ మాఫి యాకు కాసులు పండిస్తుంటే, బానిసైన యువత భవిష్యతును చిత్తుచేస్తోంది. తమ అక్రమ సంపా దన కోసం మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాల, కళాశాలల విద్యార్ధులకు గంజాయికి అలవాటు చేసి కోట్ల రూపాయలను  దండుకుం టున్నారు. గ్రామాల్లోని పాఠశాల విద్యార్ధులు, కాలేజి విద్యార్థులు గంజాయికి అలవాటు పడ టంతో లేత వయసులోనే విద్యార్దుల జీవితాలు చిక్కి శల్యమైపోతున్నాయి. ప్రస్తుత సమాజంలో చెడు వ్యసనాలను ప్రోత్సహించే వారి సంఖ్య పెరిగిపోతోంది. మద్యపానం, ధూమపానం అనే ది ప్రస్తుత కాలంలో  చాలా చిన్న వయసు నుంచే మొదలవుతోంది. పిల్లలతో చర్చించలేక పోవడం, ఒంటరితనాన్ని, బాధను మర్చి పోవ టం కోసం మత్తు పదార్థాలకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. బాల్యం అనేది భవిష్య త్తుకు పునాది వేసుకొనే మంచి అవకాశాల దశ. కౌమార దశకు  ఎదిగే క్రమంలో పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకోవడం, పలు సామర్థ్యాలను రూపొందించుకోవడం, మంచి వ్యక్తిత్వానికి పు నాది వేసుకోవడం జరుగుతుంది.

No comments:

Post a Comment