Breaking News

29/10/2019

బీహార్ లో సంకీర్ణ సర్కార్ కు డేంజర్ బెల్స్

పాట్నా, అక్టోబరు 29 (way2newstv.in)
ఎందుకిలా జరుగుతోంది? పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఊపు మీద విజయం సాధించిన బీజేపీ, జేడీయూ కూటమి బీహార్ లో ఉప ఎన్నికల్లో మాత్రం చతికలపడింది. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా ఈ ఉప ఎన్నికల ఫలితాలు అధికార జేడీయూ, బీజేపీలను ఇబ్బంది పెట్టాయని చెప్పక తప్పదు. బీహార్ లో జేడీయూ, బీజేపీ కూటమి బలంగా ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.అయితే జేడీయూకు ఉప ఎన్నికలు అచ్చిరావడం లేదన్నది మరోసారి రుజువయింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో జనతాదళ్ యు పోటీ చేయగా మూడుస్థానాల్లో ఓటమి పాలయింది. కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. 
బీహార్ లో సంకీర్ణ సర్కార్ కు డేంజర్ బెల్స్

కిందటి ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లోనూ జేడీయూ ఘోర పరాజయం పాలయింది. ఆర్జేడీ విజయం సాధించింది. అయితే పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి జేడీయూ 16, బీజేపీ 17 ఎంపీ స్థానాలను గెలుచుకుని మీసం మెలిశాయనే చెప్పాలి.ఉప ఎన్నికల్లో మాత్రమే జేడీయూ చతికల పడుతోంది. ఇందుకు గల కారణాలను కూడా జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విశ్లేషణ చేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ లో పొత్తు ఇప్పటికే ఖరారయింది. బీజేపీ, జేడీయూ కలసి పోటీ చేస్తాయని ప్రకటన కూడా చేశారు. నితీష్ కుమార్ సారథ్యంలోనే ఎన్నికలకు వెళతామని, ఆయనే బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని అమిత్ షా ప్రకటించేశారు కూడా.కానీ బీహార్ లో ఎంఐఎం ఉప ఎన్నికల్లో గెలవడం జేడీయూకు మింగుడు పడటం లేదు. బీహార్ లోని కిషన్ గంజ్ అసెంబ్లీ స్థానాన్ని ఎంఐఎం ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలుచుకుంది. ఎన్నడూ లేనిది ఎంఐఎం బీహర్ లో అడుగుపెట్టడం ఎవరికి నష్టమన్న చర్చ అన్ని పార్టీలోనూ తీవ్రంగానే జరుగుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ వైపే ముస్లిం ఓటు బ్యాంకు ఉంటుంది కాబట్టి తమకు జరిగే నష్టమేదీ లేదని జేడీయూ అంటున్నా లోలోపల ఎంఐఎం దెబ్బకొడుతుందేమోనన్న ఆందోళన అయితే ఉంది. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ ను ఘోరంగా దెబ్బతీసిిన ఎంఐఎం బీహార్ లో కూడా అదేపనిచేస్తుందేమో నన్న అనుమానం కూడా లేకపోలేదు. ఈసారి బీహార్ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఎంఐఎంను లక్ష్యంగా చేసుకునే ప్రచారాన్ని నిర్వహించనున్నాయి.

No comments:

Post a Comment