Breaking News

29/10/2019

వంశీ మార్గంలో మరింత మంది తమ్ముళ్లు

విజయవాడ, అక్టోబరు 29 (way2newstv.in)
కర్ర విరగకూడదు … పాము చావకూడదు… గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ ఈ బాటలోనే పార్టీకి వీడ్కోలు పలకాలని చూస్తున్నట్లు వుంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి చూపించిన మార్గం బాగుందనిపించినట్లు వుంది. అధినేతతో సఖ్యత చెడిపోకుండా తాము అనుకున్న పార్టీలోకి జంప్ అయ్యే ఈ స్కెచ్ చక్కగా అమలు చేసింది మాత్రం మాజీ టిడిపి నాయకుడు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టేముందు రేవంత్ కథ చాలానే నడిపారు. టిడిపికి ఇక తెలంగాణ లో సీన్ లేదని గ్రహించి తన దారి తాను చూసుకోవాలని డిసైడ్ అయిపోయారు రేవంత్. సరిగ్గా వల్లభనేని వంశీ అలాగే అంచనా వేసుకున్నారు. రేవంత్ కి ఇలాంటి ప్లాన్ ఇచ్చింది చంద్రబాబే అని అప్పట్లో టాక్. ఇప్పుడు ఆ ప్లాన్ ను తమ్ముళ్ళు బయటకు తీసి చంద్రబాబు కి చుక్కలు చూపించేందుకు సిద్ధం కావడం విశేషం.
వంశీ మార్గంలో మరింత మంది తమ్ముళ్లు

టిడిపి భవిష్యత్తుపై అనుమానాలు బలంగా ఉండటం, రాబోయే నాలుగున్నరేళ్ళు ముళ్లపొదలు దాటుకుంటూ వెళ్లడం కన్నా చక్కగా తన దారి తాను చూసుకోవడం ముఖ్యమని వైసిపి సర్కార్ ఏర్పడ్డ నాలుగున్నరనేలల్లోనే గ్రహించేశారు. దానికి పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. సేమ్ టూ సేమ్ రేవంత్ లాగే స్పీకర్ కి కాకుండా అధినేత చంద్రబాబు కు పంపేసి చేతులు దులుపుకున్నారు ఆయన. ఇది ఎలాగూ చంద్రబాబు స్పీకర్ కి పంపే అవకాశాలు లేవు. ఎందుకంటే స్పీకర్ ఫార్మాట్ లో ఆ లేఖ లేదు కాబట్టి. అలాగే ఒకవేళ పంపినా గన్నవరం ఉపఎన్నిక ఎదుర్కొనేందుకు సిద్ధంగా తెలుగుదేశం లేదు. కృష్ణా జిల్లా పార్టీలో బలమైన గన్నవరంలో ఎదురులేని నాయకుడు గా వున్న వల్లభనేని వంశీ వెళ్ళిపోతే ఆ స్థాయి నేతకు ఇప్పుడు చంద్రబాబు టికెట్ ఇవ్వాలి అంటే కష్టమైన పనే. సో ఎన్నికలకు బాబు రెడీ గా లేరు కాబట్టి వల్లభనేని వంశీ రాజీనామా లేఖ తన వద్దే అట్టేపెట్టుకోక తప్పదు.అదే ఇప్పుడు టిడిపి లో వున్న వల్లభనేని వంశీ ప్రత్యర్థులకు చిరాకు తెప్పిస్తుంది. దేవినేని ఉమా, బోండా ఉమా వంటివారు ఇప్పటికే వంశీ ప్లాన్ కనిపెట్టి కస్సుబుస్సు అంటున్నారు. అయితే తమ అధినేత చంద్రబాబు వల్లభనేని వంశీ విషయంలో అంతర్గతంగా అనుసరిస్తున్న వ్యూహం వారికి అర్ధం కావడం లేదు. వైసిపి కి సైతం ఇప్పటికిప్పుడు వల్లభనేని వంశీ వచ్చి పార్టీలో చేరాలిసిన అవసరం లేదు. తటస్థంగా వున్నా సమయం చూసి రప్పించుకుని పని మొదలు పెడుతుంది. ఈ లోగా నియోజకవర్గంలోని సొంత పార్టీ క్యాడర్ అసంతృప్తిని చల్లార్చుకోవొచ్చు. ఇలా తమ కార్యాచరణలో వైసిపి వుంది. మొత్తానికి వల్లభనేని వంశీ తన రాజీనామాతో సృష్ట్టించిన తుఫాన్ టీ కప్పులో తుఫాన్ లా త్వరలోనే సమసి పోతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.

No comments:

Post a Comment