Breaking News

26/10/2019

బస్సులు లేక ఆటోలే శరణ్యం..

కాలు జారిందంటే చాలు ఆస్పత్రి పాలే....
విద్యార్థుల ఆందోళన....
వనపర్తి అక్టోబరు 26, (way2newstv.in
గోపాల్ పే ట మండలం లోని సాకల్ పల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడవకపోవడం వల్ల ఆటోలే శరణ్య మంటూ విద్యార్థులంతా ఆటోలలో గోపాల్ పేట లోని విద్యా సంస్థలకు చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులంతా ఆటోల ఇరుప్రక్కలనే కాకుండా వెనుకభాగం నిల్చుని ప్రయాణం చేస్తుండడం వల్ల కాలు జారితే చాలు ఆస్పత్రి పాలెనని వారు విచారణం వ్యక్తపరుస్తున్నారు. 
బస్సులు లేక ఆటోలే శరణ్యం..

ఒకపక్క ఆర్టీసీ కార్మికుల సమ్మె మరోపక్క గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేక పోవడం వల్ల తమకు ఈ దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు సత్య వార్త బ్యూరో తో విచారాన్ని వ్యక్త పరిచారు. ఈ పరిస్థితి నెలకొని నెలలు గడుస్తున్నా కూడా ఎవరు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల తాము దినదినగండంగా ఆటోలో ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. నాగర్ కర్నూల్ డిపో యాజమాన్యం వారు తమ గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సులు నడుపుతూ ఉండేవారని, ప్రస్తుతం బంద్ కావడంవల్ల ఆటోల్లో ప్రయాణిస్తూ విద్యాలయాలకు చేసుకుంటున్నామని వారన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించి విద్య కు ఆటంకం కలిగించకుండా ఉండాలని విద్యార్థులు కోరుతున్నారు.

No comments:

Post a Comment