అమరావతి అక్టోబరు 26, (way2newstv.in)
రాష్ట్రంలో 9,674 గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసాం. పలు కారణాలతో ఖాళీ అయిన వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. నవంబర్ 1 నుంచి భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ అన్నారు. నవంబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరిస్తాం.
వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్
నవంబర్ 15 నుంచి దరఖాస్తుల పరిశీలన వుంటుందని అన్నారు. 16 నుంచి 20 వరకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కొత్తగా ఎంపికైన వాలంటీర్లుడిసెంబర్ 1 నుంచి విధుల్లోకి చేరాల్సి వుంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ద్వారా ఖాళీలను భర్తీ చేస్తామని అయన వెల్లడించారు. ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీలను ప్రకటించి భర్తీ చేపడతామని అన్నారు.
No comments:
Post a Comment