Breaking News

12/10/2019

యోగికి డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయా...

లక్నో, అక్టోబరు 12, (way2newstv.in)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 11 శాసనసభ స్థానాల్లో ఉప ఎన్నికల్లో జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2022 లో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలూ రిహార్సల్స్ గా భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీకి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ కు ఉప ఎన్నికలు సవాల్ గా మారాయి.ఉప ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా బీజేపీకి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. అత్యధిక మెజారిటీ ఉండటంతో ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేవు. 
యోగికి డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయా...

కానీ అదే సమయంలో నాయకత్వాన్ని మాత్రం ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు రాజకీయ నిపుణులు. గతంలో లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమి పాలయింది. ఈ ఫలితాలతోనే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ ఏకమయ్యాయన్న సంగతి తెలిసిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య విజయం యూపీలో బీజేపీ సాధించింది. కానీ దీనికి మోడీ క్రేజీయే కారణమంటున్నారు. ఈ విజయం వెనక యోగి ఆదిత్యనాధ్ శ్రమ ఏమీ లేదనేది పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మోదీ ఇమేజ్ వల్లనే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యమయిందని, ఎస్పీ, బీఎస్పీ కలిసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయన్నది బీజేపీ కేంద్ర నాయకత్వం భావన. అందుకే ప్రస్తుతం జరుగుతున్న 11 శాసనసభ ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోకుంటే యోగి ఆదిత్యానాధ్ సీటుకు ఎసరు తప్పదన్న వ్యాఖ్యలయితే విన్పిస్తున్నాయి.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలగా గెలవడంతో ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాల్లో తొమ్మిదింటిని బీజేపీ గెలుచుకుంది. బీఎస్పీ, ఎస్సీ చెరొక సీటును సాధించాయి. సిట్టింగ్ స్థానాలను చేజారి పోకుండా చూడాల్సిన బాధ్యత యోగి ఆదిత్యానాధ్ పైనే ఉందంటున్నారు. అందుకే ప్రచార బాధ్యతలను కూడా యోగి ఆదిత్యనాధ్ కే అప్పగించారు. ఈ ఉప ఎన్నికలు మాత్రం యోగికి పరీక్ష అని మాత్రం చెప్పక తప్పదు.

No comments:

Post a Comment