Breaking News

12/10/2019

కాంగ్రెస్ ముందే చేతులు లేపేసిందే...

ముంబై, అక్టోబరు 12, (way2newstv.in)
అసలే సమస్యలతో సతమతమవుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ముందుగానే కాంగ్రెస్ కూటమి ఓటమికి చేతులెత్తేసిందనే చెప్పాలి. తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర పరిణామాలు బీజేపీ కూటమికి కలసి వచ్చేవిగా కన్పిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలను అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత లోక్ సభ ఎన్నికల్లో దాదాపు అత్యధిక స్థానాలను గెలుచుకున్న బీజేపీ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమన్న ధీమాలో ఉంది.ఇక విపక్ష కాంగ్రెస్ కూటమి మాత్రం ముందుగానే చేతులెత్తేసినట్లు కన్పిస్తుంది. నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, పార్టీకి భవిష్యత్తు లేదని తేలిపోవడంతో పేరున్న కాంగ్రెస్ నేతలు పార్టీని జారుకుంటున్నారు. 
కాంగ్రెస్ ముందే చేతులు లేపేసిందే...

దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. కొందరు బీజేపీలో చేరగా, మరికొందరు శివసేనను ఆశ్రయించారు. కాంగ్రెస్ కూటమిలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ కు కూడా షాక్ తగిలింది.దీంతో అభ్యర్థుల ఎంపికను నెల రోజుల ముందు నుంచే ప్రారంభించినా కాంగ్రెస్ కు సవాళ్లు ఎదురయ్యాయి. అభ్యర్థుల ఎంపిక సక్రమంగా లేదంటూ మరికొందరు పార్టీని వీడి వెళ్లిపోయారు. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థులు అగ్రనేతల ప్రచారం కోసం ఎదురు చూస్తున్నారు. వారు వస్తే తమ నుదుటి రాత మారుతుందేమోనన్న ఆశాభావంతో ఉన్నారు. విజయం మీద పెద్దగా ఆశలు లేకపోవడంతో డబ్బులు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడుతున్నారు.ఇక బీజేపీ కూటమి మాత్రం ఫుల్ జోష్ లో ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ పూర్తిగా డీలా పడటంతో తాము ఖచ్చితంగా మహారాష్ట్రను మరోసారి చేజిక్కించుకుంటామన్న నమ్మకంతో ఉంది. లోక్ సభ ఎన్నికలు జరిగిన తర్వాత నెలల్లోనే ఈ ఎన్నికలు రావడంతో తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ కూటమి మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు. దాదాపు ఓటమి అంచుకు ఎన్నికలకు ముందే వెళ్లిపోయినట్లు ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

No comments:

Post a Comment