Breaking News

04/10/2019

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు అల్లోల, ఎర్రబెల్లి

వరంగల్, అక్టోబర్ 04 (way2newstv.in):
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దస్యం వినయ భాస్కర్  శుక్రవారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రులకు, చీఫ్ విప్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు అల్లోల, ఎర్రబెల్లి

దేవి నవరాత్రులను పురస్కరించుకుని వారు కుటుంబ సమేతంగా అమ్మవారినిదర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వారికి ఆలయపూజారులు అమ్మవారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు.  ఈసందర్బంగా మంత్రులు మాట్లాడుతూ...అమ్మవారిఆశీస్సులు ప్రజలపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు పేర్కొన్నారు. మంత్రులకు స్వాగతం పలికిన వారిలో ఆలయ అధికారులు,  వేద పండితులు,
పాలకవర్గ సభ్యులున్నారు.

No comments:

Post a Comment